Harishrao:సీఎం హోదాలో అబద్దాలా?

5
- Advertisement -

సీఎం హోదాలో ఉండి అబద్ధం చెప్పడానికి రేవంత్ రెడ్డికి కొంచమైనా సిగ్గుండాలన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. నాడు ఫార్మా సిటీ అని గజిట్ ఇచ్చి.. మాట మార్చి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటున్నావ్..ముందు నువ్వు ఇచ్చిన గజిట్ వాపస్ చేసుకో అని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్ల ప్రజల దగ్గరికి వెళ్లి మాట్లాడాలన్నారు. పట్ట పగలే అబద్ధాలను కూడా నిర్భయంగా చెప్పే రేవంత్ కు డాక్టరేట్, డబుల్ PHD ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ఫేక్ గ్యారెంటీలకు మహారాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.

రేవంత్, కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. కూలిపోయిన కాళేశ్వరం నుండి హైదరాబాద్ కు నీళ్లు ఎట్లా ఇస్తావ్ సిగ్గులేని రేవంతూ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read:NRI BRS:యూకే నూతన అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి

- Advertisement -