Harish:నాణ్యమైన విద్య ఎక్కడా?

12
- Advertisement -

కాంగ్రెస్ సర్కార్ నాణ్యమైన విద్య అందించడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎక్స్ వేదికగా స్పందించిన హరీశ్..జూనియర్‌ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ పాఠ్యపుస్తకాలు అందించకపోవడంపై స్పందించిన హరీష్… ఈ అంశంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని అన్నారు. రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది జీరో అడ్మిషన్స్ నమోదవడం పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్‌ రావు వెల్లడించారు.

Also Read:ఫుడ్ పాయిజన్ తగ్గించే చిట్కాలు..

- Advertisement -