Harishrao:ప్రశ్నిస్తే కేసులా?ఇదేం పాలన?

14
- Advertisement -

మెదక్‌ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ మోసం చేస్తే ఆ కలను నెరవేర్చింది కేసీఆర్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.రేవంత్ చెప్పవన్నీ అబద్ధాలే. మెదక్ రాందాస్ చౌరస్తా మీదుగా నామినేషన్ కు వెళ్లావే, అక్కడ అభివృద్ధి కనిపించలేదా? అని ప్రశ్నించారు.మెదక్‌లో మాట్లాడిన హరీష్..నువ్వు నామినేషన్‌కు వెళ్లిన కలెక్టరేట్ కట్టింది కేసీఆర్. నిన్ను మెదక్‌కు రప్పించిన ఘనత కేసీఆర్‌ది అన్నారు.మెదక్‌కు రైలు తెచ్చింది కేసీఆర్. వంద కోట్లు ఖర్చు చేసి లైన్ తెచ్చాడు. మూడు జిల్లాలు చేసి, మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేశాడన్నారు.

చిట్టచివరి ఆయకట్టుకు నీళ్లిచ్చాడు. ఇంత చేసినా కేసీఆర్ ఏమీ చేయలేదంటున్నావు…ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ వందకోట్లు ఇస్తే వాపసు తీసుకున్నావు. నీకు అమ్మవారి ఉసురు తగులుతుందన్నారు. అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి…ఉరికిచ్చి కొడ్తా, పేగులు మెడలే వేసుకుంటా, బొందపెడ్తా, మానవ బాంబునవుతా అంటున్నావు. ఇవేనా సీఎం మాట్లాడ్లాల్సింది? అన్నారు.

హామీల గురించి అడిగితే హెచ్చరిస్తున్నావు కేసులు పెడుతున్నావు…డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని వందరోజులు దాటినా చేయనందుకు చెంపలేసుకుని 60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పు. మాట తప్పడం, అబద్ధాలు ఆడడం రేవంత్ నైజం.. అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని లోకల్ కాదంటున్నావు, ఆయన ఇక్కడే స్థిరపడిన ఓటర్. కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజిగిరికి పోయింది నువ్వు…నా ఎత్తుతో రేవంత్‌కు ఏం పని? రైతుల గురించి ఆలోంచి, సమస్యలు పరిష్కరించాలి.అహంకారంతో గాల్లో తేలుతున్న కాంగ్రెస్ భూమ్మీది రావాలంటే వెంకట్రామిరెడ్డిని పార్లమెంటుకు వెళ్లాలన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు 18 రోజులుగా వేచిచూస్తున్నా ప్రభుత్వం కొనడం లేదు..బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొన్నాం అన్నారు.

Also Read:భువనగిరిలో గెలుపు నాదే:క్యామ మల్లేష్

- Advertisement -