కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం ఆ పార్టీ మోసానికి పరాకాష్ట అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు.తెలంగాణలో యాసంగిలో పండేదే దొడ్డు వడ్లు. పండని సన్నవడ్లకు బోనస్ ఇస్తామనడం మోసం కాదా, రైతులు నోట్లలో మట్టికొట్టడం కాదా? అన్నారు. వానకాలంలో 20 శాతం సన్నాలు, యాసంగిలో 99 శాతం దొడ్డువడ్లు పండుతాయి,నిరుద్యోగులకు 4 వేల భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, తర్వాత ఆ హామీ ఇవ్వలేదని అసెంబ్లీలో చెప్పారు. వడ్ల విషయంలోనూ మాట తప్పుతున్నారన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో సన్నవడ్లకు అని ఎక్కడా చెప్పకుండా వరిధాన్యానికి చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం పండని వడ్లకు ఇస్తామంటున్నారు…రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించడం వల్లే మనం ఇంత తండి తింటున్నాం అన్నారు.రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అందరూ వరిధాన్యానికి బోనస్ అనే చెప్పారు…కోటి 20 లక్షల వరి ధాన్యానికి 500 బోస్ ఇవ్వాలంటే 6 వేల కోట్లు కావాలి. సన్నాలకు మాత్రమే ఇస్తే 500 కోట్లు సరిపోతాయి.4500 కోట్లు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారన్నారు.
రైతుభరోసా కింద 15 వేలు ఇస్తామని చెప్పి పాక్షికంగానే ఇస్తున్నారు. గతంలో మాదిరే తొలి విడత కింద 7500 కాకుండా 5 వేలే ఇస్తున్నారు…కాంగ్రెస్ హామీ ప్రకారం రైతుభరోసా కింద 15 వేలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్నారు. బకాయి పడిన 2500, వానకాలం పంటల విడత కింద 7500 కలిపి జూన్ లోపల 10 వేలు ఇవ్వాలి…సన్నవడ్లకే మాత్రమే బోనస్ ఇస్తారా? దొడ్డు వడ్లకు ఇవ్వరా? దొడ్డువడ్లకు ఇస్తే ఎప్పటి నుంచి కొంటారో చెప్పాలన్నారు. మీ ఎన్నికల హామీ ప్రకారం జొన్న, మిరప, పసుపు, సోయాబీన్, ఎర్రజొన్న ఇతర పంటలకు కూడా మద్దతు ధర ఇవ్వాలి? వాటికి ఇస్తారా ఇవ్వరా?,వడ్ల బోనస్ విషయంలో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చేలా రైతాంగాన్నిఏకం చేసి పోరాడతాం అన్నారు..
Also Read:10 యూనివర్సిటీలకు ఇంఛార్జీ వీసీలు..