కేసీఆర్ పాలనే భేష్!

6
- Advertisement -

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ మోతి నగర్ వాసవి బృందావనం అపార్ట్మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం కావాలన్నప్పుడు ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు…తెలంగాణ వస్తే తాగడానికి నీళ్లు ఉండవు. కరెంటు ఉండదు అని అన్నారు. అసలు వీరికి పరిపాలనే చేతకాదు అన్నారు.

గత పది సంవత్సరాల పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ..బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అన్న నానుడిని మార్చి తెలంగాణ ఆచరిస్తది దేశం అనుసరిస్తది అన్నట్టుగా కేసీఆర్ పాలన సాగింది….దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు…శుద్ధిచేసిన మంచినీళ్లను ప్రతి ఇంటికి అందించకపోతే ఓటే అడగను అని చెప్పిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు.

ఎంతోమంది నాయకులు పాలించారు కానీ ఎవరు కూడా కనీసం తాగునీరు అందించలేదు…మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు ఆదర్శంగా తీసుకొని హర్ ఘర్ కు జల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు…8 ఏళ్లయినా హర్ ఘర్ కు జల్ కార్యక్రమాన్ని కేంద్రం పూర్తి చేయలేదు…కేసీఆర్ రాకముందు హైదరాబాదులో ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండేది.
మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేపట్టారు. ..కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకున్నారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుంది….ఒక హైదరాబాదులోనే 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షించాం అన్నారు.

కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన షీ టీమ్ అనే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది. మహిళలకు భద్రతను పెంచింది…తెలంగాణ అంటే కరువు కాటకాలు, తెలంగాణ అంటే రైతు ఆత్మహత్యలు, తెలంగాణ అంటే సాగునీరు కాదు కదా కనీసం తాగడానికి కూడా నీళ్లు ఉండేవి కాదు…కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మించి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో భారతదేశంలో అతి ఎక్కువ వరి ధాన్యం పండే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది…68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము ఉత్పత్తి నుంచి 2023లో రెండు కోట్ల 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని పెంచాం…రైతు దేశానికి వెన్నుముకని, రైతుని కాపాడుకొని వ్యవసాయంలో తెలంగాణను నెంబర్ వన్ గా నిల్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం…పర్ క్యాపిటా ఇన్కమ్ 2014 లో 1,24000 ఉండే. 2023 – 24 లో 3,74000 తో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది అన్నారు. జీఎస్డీపీ గ్రోత్ రేట్ లో తెలంగాణ నెంబర్ వన్. స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూలో తెలంగాణ నెంబర్ వన్…ఎంతో నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకు నడిపించారు కేసీఆర్…సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చాలా రోజుల తర్వాత హైదరాబాదుకు వచ్చి ఇది హైదరాబాదా న్యూయార్క్ నగరమా అన్నంతగా ఆశ్చర్యపోయానని వారే చెప్పారు…ఆంధ్రాలో ఒక ఎకరం అమ్ముతే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది కాని ఈరోజు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ..ఎకరాలు కొనవచ్చు అని చంద్రబాబు గారు చెప్పారు.
ఇండస్ట్రీలు లైన్లు కట్టి తెలంగాణకు, హైదరాబాద్ కు వచ్చాయి…మంత్రి కొండా సురేఖ గారి కుమార్తె స్వయంగా చెప్పారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ని గన్నుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని..తుపాకీ పెట్టాం కానీ ఆ పంపించిన తుపాకి ముఖ్యమంత్రిదా, మాదా అని పంచాయతీ అన్నారు.

#JubileeHillsWithBRS #VoteForCar

- Advertisement -