శాసనమండలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి శాసనమండలి సభ్యులు విషెస్ చెప్పారు.ఈ సందర్భంగా మాట్లాడిన శాసనసభా వ్యహహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి …కష్టపడితే ఎంతటి పదవులైనా అధిరోహించ వచ్చిని మిమ్మల్ని చూసి జూనియర్ లుగా మేమెంతో నెర్చుకుంటామన్నారు.
అనేక పదవులను అధిరోహించారు..చైర్మన్ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తారని కోరుకుంటున్నానని చెప్పారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న గుత్తాకి మండలి చైర్మన్ పదవికి వన్నె తెస్తారని చెప్పారు.
మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తాకు శుభాకాంక్షలు చెప్పారు మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్. వార్డు మెంబర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనేక పదవులు అధిరోహించారు..
డైరీ చైర్మన్ గా అనేక బాధ్యతలు అదిరోహించారు,మండలి ఛైర్మెన్ గా నియమితులయ్యారు..
శాసన మండలి సభ్యులతో పాటు ఆల్ ఇండియా లో మంచిపేరు తెచ్చుకోవాలని కోరుతున్నానని చెప్పారు.
మిమ్మల్ని చైర్మన్ గా ప్రతిపాదించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు..కళాశాలలో విధ్యార్థి నేతగా సేవలుదించారు..పోటీ చేసిన ప్రతిసారి అధిక మెజారిటీ గా ఎంతో సేవలందించారు…రైతుసమన్వయ సమితిగా కూడా రైతులకు ఎంతో సేవచేసారు పోచారం తరహాలో మీకు కూడా చైర్మైన్ పదవి ఇచ్చారని చెప్పారు.
శాసన వ్యవస్తలో అత్యున్నత స్థానం నిలబెట్టిన ముఖ్యమంత్రికి.. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అన్ని పక్షాల సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హరీష్ రావు. అన్ని వ్యవస్తల్లోనూ పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. అతి చిన్న పదవి నుండి అత్యున్నత స్థానానికి చేరుకున్నందుకు మీకు శుభాకాంక్షలు…తెలంగాణ ఉద్యమం లో అణిచివేత కు గురిచేసిన సమయం ఉద్యమం.. ప్రజలవైపు నిలబడ్డారని చెప్పారు. ఉద్యమ సమయంలో తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఎంతో కృషి చేశారు…ఆజాను భావులు మీరు.. మీరు కూర్చున్న కుర్చికి వన్నెతెచ్చారు..
మీ అనుభవంతో సీటుకు వన్నెతెస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.
అజాత శత్రువు గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ పదవికి ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు. మీపై ఎలాంటి ఫిర్యాదులు ఉండకూడదని కోరుకుంటున్నా…మంచి చర్చ జరుగుతుందని భావిస్తున్నా అని చెప్పారు. విపక్షాలకు సమస్యలు లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా…ప్రజలకు ఇక్కడి విషయాలు తెలియడం లేదు.. అసెంబ్లీ చర్చల తరహాలోనే మండలిలో చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.