కరోనా పాజిటివ్ ఉన్న గర్బిణికి గాంధీ ఆస్పత్రి డాక్టర్లు సురక్షిత ప్రసవం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై ప్రశంసలు గుప్పించారు మంత్రి హరీష్ రావు.
కరోన సోకిన నిండుచూలాలిలో ధైర్యం నింపి.. ప్రత్యేక జాగ్రత్తలతో ప్రసవం చేసి తల్లిబిడ్డలకు పునర్జన్మ ప్రసాధించిన మన గాంధీ హాస్పిటల్ వైధ్యులు దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కనిపించే దైవాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా.. ఇంటికి చేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు హరీష్.
హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన మహిళ (22) ప్రసవం కోసం పేట్లబుర్జు ప్రసూతి దవాఖానను ఆశ్రయించారు. ఆమెలో కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను మూడురోజుల క్రితం గాంధీకి తరలించారు. పాజిటివ్ గర్భిణికి సాధారణ ప్రసవం చేస్తే ప్రమాదం పొంచి ఉండటంతో శుక్రవారం శస్త్రచికిత్స ద్వారా ప్రసవంచేయగా, మగ శిశువు జన్మించాడు.