నాడైనా-నేడైనా..తెలంగాణకు కాంగ్రెస్‌ విలనే

11
- Advertisement -

నాడు రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్..మన విద్యార్థులను, యువకులను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్..మన ప్రాజెక్టులను రద్దు చేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. నదీ జలాలు – కాంగెస్ ద్రోహాలు అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హరీష్.

రాష్ట్ర విభజన సమయంలో కూడా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను 11వ షెడ్యూల్‌లో పెట్టకుండా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు ద్రోహం చేసింది కాంగ్రెస్. ..నాడైనా, నేడైనా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి శాసనసభ వ్యవస్థను తప్పుదారి పట్టించిన నీ నాలుకను కొయ్యాలి రేవంత్ అన్నారు.

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పీపీటీ ద్వారా చెప్పినవన్నీ అబ్ధాలే అని చెప్పారు. నాడు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపి మరణశాసనం రాసిందే కాంగ్రెస్‌ పార్టీ అని మండిపడ్డారు. 1956కు ముందు హైదరాబాద్ రాష్ట్రంగా తెలంగాణ ప్రాంతం ఉండేది. ఆనాడు ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌తో కలిపిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణను సొంత రాష్ట్రంగా ఉంచాలని ఫజల్‌ అలీ కమిషన్‌ స్పష్టంగా చెప్పినా తెలంగాణను ఏపీలో కలిపి మరణశాసనం రాసిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ తొలిదశ ఉద్యమ సమయంలో 1969లో సిటీ కాలేజీలో 369 మంది విద్యార్థులను కాల్చిచంపిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. మలిదశ ఉద్యమ సమయంలో ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకుని వందలాది మంది యువకులను పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

నాడు ఫజల్‌ అలీ కమిషన్‌ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌తో కలుపవద్దని స్పష్టంగా చెప్పింది. ఒకవేళ కలిపితే 174 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యంగా అప్పర్‌ కృష్ణ, తుంగభద్ర ఎడమ కాలువ, బీమా వంటి ప్రాజెక్టులను రద్దు చేయవద్దని, కొనసాగించాలని స్పష్టంచేసింది. అయినా నాడు ఆ ప్రాజెక్టులను రద్దుచేసి పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చింది ఈ కాంగ్రెస్‌ పార్టీ. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్‌ పార్టీ. హైదరాబాద్‌ సొంత రాష్ట్రంగా ఉంటే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. నల్లగొండ ఫ్లోరైడ్‌ బాధలు, పాలమూరు వలసల బాధలు తప్పేవి అని అన్నారు.

Also Read:‘సైక్ సిద్ధార్థ’ హౌస్ ఫుల్ రన్!

 

- Advertisement -