- Advertisement -
తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా బతికిన ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో జయశంకర్ సార్ ది ప్రత్యేక స్థానం అన్నారు.
జయశంకర్ సార్ మార్గంలో, కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది… తొమ్మిదిన్నరేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు.
‘బాధిత సమాజం గళం విప్పినప్పుడు.. విద్యావంతులు కలం పట్టాలి’ అనే ఉద్బోధను జీవితాంతం ఆచరించిన జయశంకర్ సార్ నడిచిన దారిని అనుసరించటమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
Also Read:కౌశిక్ అరెస్ట్..కక్ష సాధింపు చర్యే:హరీష్
- Advertisement -

