పటాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి గారు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు కలిసి ఈరోజు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని..తెలంగాణ ప్రాంతంలో ఇఫ్తార్ విందు అనేది హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తారు అన్నారు.
సోమిరెడ్డి 20 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నారు… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం చేసింది అన్నారు. ఎన్నికల్లో 4000 కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఇస్తామని చెప్పి గత బడ్జెట్లో 3000 కోట్లు పెట్టారు. అందులో 1000 కోట్లు కూడా ఇప్పటివరకు ఖర్చు చేయలేదు.ఖర్చుపెట్టిన డబ్బులు కూడా కేసీఆర్ గారు పెట్టిన మైనార్టీ గురుకులాల కోసం మాత్రమే ఇచ్చారు అన్నారు.
మైనార్టీ యువకుల కోసం మహిళల కోసం ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదు.. షాదీ ముబారక్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇస్తానన్న తులం బంగారం మాటే లేదు.ఇమామ్, మౌజంలకు గౌరవ వేతనం పెంచుతామని చెప్పారు కనీసం కెసిఆర్ గారు ఇచ్చిన గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వడం లేదు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక మత ఘర్షణలు జరిగాయి. కెసిఆర్ గారు ఉన్నప్పుడు హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫా కూడా ఇవ్వడం మానేసింది. క్యాబినెట్లో ఒక మైనార్టీ మినిస్టర్ కు అవకాశం లేదు. మొన్న ఇచ్చిన ఎమ్మెల్సీలలో కూడా ముస్లిం మైనార్టీలకు చోటు లేదు. కాంగ్రెస్ చెప్పుకోవడం సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటుంది కానీ ఈ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తనకి మోడీకి ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరిచాడు అన్నారు.
75 కోట్ల ప్రత్యేక నిధులను తెల్లాపూర్ మున్సిపాలిటీకి కేసీఆర్ ఇచ్చారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 కోట్ల నిధులను రద్దు చేసింది.. ప్రభుత్వం ఉన్నంత మాత్రాన కేసీఆర్ గారు ఇచ్చిన నిధులను ఎందుకు వెనక్కి తీసుకెళ్లారు? అన్నారు.
Also Read:కూలీ ఓటీటీ రైట్స్.. భారీ ఆఫర్!

