రాహుల్‌ గాంధీకి హరీష్‌ బహిరంగలేఖ

4
- Advertisement -

తెలంగాణలో 22A నిషేధిత జాబితా భూముల సెక్షన్ దుర్వినియోగంపై రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో HMDA అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను 22A జాబితాలో పెట్టి వేధింపులు చేస్తున్నారని ఆరోపించారు.

రెవెన్యూ శాఖలో 30 శాతం వసూళ్ల దందా సాగుతుంది… నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు 30% కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి అన్నారు.

Also Read:పైనాపిల్ పొట్టును సరిగ్గా తీయడం ఎలా?

22Aపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి..దీనిపై వెంటనే స్వతంత్ర విచారణకు రేవంత్ ప్రభుత్వం ఆదేశించాలి అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు అంటూ గాంధీకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -