రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోవాలని మీరే స్వయంగా పిలుపునిచ్చారు. మీ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. డిసెంబర్ 9 నాడు మీరు ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదు. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు కావొస్తున్నది. అయినప్పటికీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణ మాఫీ కాలేదన్నారు.
రైతులకు తక్షణమే రూ.2లక్షల రణమాఫీ చేయాలని …అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఒక్క రైతుకు కూడా మాఫీ కాలేదని విమర్శించారు. రైతులకు బ్యాంకులు నోటీసుల మీద నోటీలు ఇస్తూ కిస్తీ చెల్లింలచాలంటున్నాయని, తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాయని చెప్పారు. ఆర్థిక భారంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుకున్నారని తెలిపారు.
ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని, తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతుందన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు రూ.లక్ష చొప్పున 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది. ఏ ఓక్క బ్యాంకు కూడా రుణాలు చెల్లించాలని ఎప్పుడూ రైతులపై ఒత్తిడి తీసుకురాలేదు. లక్ష రూపాయల వరకు రైతులకు సంబంధించిన రుణాలను మేమే కడతామని బ్యాంకర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు హామీ ఇచ్చింది. దాని ప్రకారమే ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు చెల్లింపులు చేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా రుణమాఫీ పొందగలిగారు. కానీ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి విధానమూ ప్రకటించకపోవడం, ఈ బడ్జెట్ లో రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం వల్ల రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రుణమాఫీపై ప్రభుత్వం నేటివరకు అటు బ్యాంకర్లకు కానీ, ఇటు రైతులకు కానీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. రుణాలు మేమే చెల్లిస్తామని, రైతులపై ఒత్తిడి తేవొద్దని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించలేదు. ఎవరైనా రైతులు వడ్డీ భారం పడకుండా రుణాలు చెల్లిస్తే వారికి ప్రభుత్వం తిరిగి నగదు ఇస్తుందా, లేదా? అనే విషయంపైనా స్పష్టత లేదు. ఈ అనిశ్చితి.. గ్రామాల్లో రైతులకు, బ్యాంకర్ల మధ్య చిచ్చు పెడుతున్నది. స్థానిక బ్యాంకు మేనేజర్లకు వారి ఉన్నతాధికారుల నుంచి లోన్ రికవరీ కోసం నోటీసులు వస్తున్నాయి. దీంతో వారు రైతుల మీద పడుతున్నారని పేర్కొన్నారు.
Also Read:KTR:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్