Harish:డిసెంబర్ 9.. విజయ్ దివాస్

5
- Advertisement -

దశాబ్దాల ఆశ, ఆవేదన, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఉద్విగ్న భరితంగా మారి ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టిన సుదినం నేడు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.

నవంబర్ 29 దీక్ష దివాస్
డిసెంబర్ 9 విజయ్ దివాస్
2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన రోజులివి.కేసీఆర్ పోరాటం + నాలుగు కోట్ల ప్రజల చైతన్యం = తెలంగాణ ఉద్యమ చరిత్ర ..చెరిపేస్తే చెరిగిపోయేది కాదు..చరిత్ర నుదిటిపై కాలం చేసిన సంతకం..కేసీఆర్ గారు అని ఎక్స్ వేదికగా కొనియాడారు హరీష్.

తెలంగాణ భవన్ లో విజయ్ దివాస్ కార్యక్రమం జరగనుంది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు,మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, పాల్గొననున్న ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు,మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరుకానున్నారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళి అర్పించనున్నారు హరీష్‌. విజయ్ దివాస్ కు సుచికగా పింక్ బెలూన్ లను గాల్లోకి ఎగురవేయనున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు,మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్.

 

Also Read:నటుడు రాజశేఖర్‌కు ప్రమాదం

- Advertisement -