జీ రామ్‌ జీ..ఫెడరలిజంపై దాడి

8
- Advertisement -

60:40 నిధుల నిష్పత్తి పేరిట, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపైకి మోపుతూ, ఉద్దేశపూర్వకంగా MGNREGA పథకాన్ని బలహీనపరుస్తోంది అన్నారు. ఈ బిల్లు రాష్ట్రాల అధికారాలను కుదించేలా, కేంద్ర ప్రభుత్వ నియంత్రణను మరింత బలపరిచేలా రూపొందించబడింది అన్నారు.

60:40 నిష్పత్తిపై కాంగ్రెస్ మౌనం, ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు ఫెడరలిజం పరిరక్షణ అంటూ మాట్లాడే కాంగ్రెస్,@INCIndia వాస్తవానికి రాష్ట్రాలను బలహీనపరిచే బీజేపీ చర్యలకు నిశ్శబ్దంగా మద్దతిస్తోంది అన్నారు.

కేంద్ర అధికారాల కేంద్రీకరణ విషయానికి వస్తే బీజేపీ మరియు కాంగ్రెస్ రెండూ ఒకే వైపున నిలుస్తున్నాయని ఈ బిల్లు స్పష్టంగా నిరూపిస్తోంది.ఉపాధి హక్కును ప్రజల నుంచి దూరం చేస్తూ, రాష్ట్రాల స్వాయత్తతను కూడా ఒకేసారి దెబ్బతీస్తున్నారు.ఇది సంస్కరణ కాదు.ఇది ఫెడరలిజంపై దాడి అని అభిప్రాయపడ్డారు హరీష్.

Also Read:రామ్ సుతార్ మరణం..తీరని లోటు:కేసీఆర్

- Advertisement -