తెలంగాణ వచ్చాక జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు మంత్రి హరీశ్ రావు.రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో నూతనంగా నిర్మించిన తహశీల్దార్ కార్యాలయాన్ని మంత్రి సబిత ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు ఉపయోగపడేలా మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.
ఇబ్రహీంపట్నం దవాఖానను వంద పడకలకు అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో 7.50 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ….దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని….కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని అవార్డుల్లో తెలంగాణకే ఎక్కువ దక్కాయన్నారు.
Also Read:MP Santhosh:ఫొటోగ్రఫీ ఓ ఎమోషన్