Harishrao:రాబోయేది మా ప్రభుత్వమే

7
- Advertisement -

తెలంగాణ భవన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ఒక్క బీజేపీ నాయకుడూ నోరు తెరవడం లేదు..బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లి, బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకుంటుంది…తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది ఒక్క బీఆర్ఎస్‌ మాత్రమేనన్నారు.

బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు..ఒంటరిగానే పోటీ చేస్తుంది అని తెలిపారు హరీశ్‌ రావు. 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, కె.పి. వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు వాణీ దేవి, రవీందర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ నేతలు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read:పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం

- Advertisement -