Harish:అక్రమ కేసులు కాదు పేద విద్యార్థులకు అన్నం పెట్టు

2
- Advertisement -

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ అకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనతో గురుకులాలు, హాస్టళ్ళు అన్ని ఆగమైపోయిన పరిస్థితి నెలకొందన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో వేలాదిమంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు…49 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకుంది ప్రభుత్వం అని మండిపడ్డారు.

3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు..కెసిఆర్ 1000 పైగా గురుకులాలు స్థాపించి గురుకులాల గౌరవాన్ని ఎవరెస్టు శిఖరం అంత ఎత్తులో పెట్టారు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు…ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కు జూన్ నుండి నవంబర్ వరకు ఆరు నెలలుగా మెస్ చార్జీల చెల్లింపులు జరగలేదు అన్నారు.

దాదాపు తొమ్మిది లక్షల 50 వేల రూపాయలు బిల్లులు పెండింగులో ఉన్నాయి….హాస్టల్ వార్డెన్లు బంగారం కుదరబెట్టి అప్పులు తెచ్చి విద్యార్థులు ఆకలి తీరుస్తున్నారు అన్నారు. మెస్ చార్జీలు సకాలంలో చెల్లించకపోతే విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా పెడతారు?, విద్యార్థుల ఆసుపత్రి పాలైతే ఉపాధ్యాయులను, వార్డెన్లను సస్పెండ్ చేస్తా అంటున్నావ్, శిక్ష రేవంత్ రెడ్డికి వెయ్యాలి. మెస్సు బిల్లులు చెల్లించండి. రేవంత్ రెడ్డి, మెసేజ్ చార్జీలు పెండింగ్ లో పెట్టింది రేవంత్ రెడ్డి, కాబట్టి శిక్ష ముఖ్యమంత్రికి వేయాలన్నారు.

ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు మిస్ చార్జీలు విడుదల చేయలేదు…రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి చేతలు గడప కూడా దాటవు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందేమోనన్నారు. గత సంవత్సరం విద్యార్థులకు ప్లేటు, గ్లాసు, స్పూన్ టవల్స్, స్కూల్ యూనిఫార్మ్స్ అన్ని సకాలంలో అందాయి….ఈ సంవత్సరం ఇవేవీ ఇవ్వలేదు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నారు. రేవంత్ రెడ్డి ..రాజీవ్ గాంధీ పుట్టిన రోజుకు ఫుల్ పేజీ పేపర్ యాడ్ ఇస్తున్నారు. తొమ్మిది రోజుల విజయోత్సవాలు జరుపుకున్నారు. కానీ ఈ పిల్లలకు బుక్కెడు అన్నం పెట్టే చాతకాదా? చెప్పాలని ప్రశ్నించారు.

Also Read:Kavitha:బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి

- Advertisement -