హరితహారం లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించారు మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా రెడ్డి సంక్షేమ భవన్ లో హరితహారం పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు ప్రతి గ్రామం హరితవనం కావాలన్నారు.
గ్రామాల్లో మొక్కలను పెట్టించి కాపాడాల్సిన బాధ్యత సర్పంచ్ ,గ్రామ కార్యదర్శులదే అన్నారు. మొక్కల్ని పెంచని సర్పంచ్ ల పై,కార్యదర్శుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు. మొక్కల్ని పెంచితేనే గ్రామ కార్యదర్శుల ను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు…. ప్రతి గ్రామంలో 100 మంది రైతుల ను ఎంపిక చేసి వారి భూముల్లో మొక్కలు నాటించాలన్నారు.
సుబాబులు,సీతాఫల్,మల్బరీ, వేప, అల్లనేరేడు, టేకు,రావి మొక్కల్ని అధికంగా నాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, జేసీ పద్మాకర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు,సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి ,సిద్ధిపేట నియోజకవర్గ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,ఎంపీపీ లు,జడ్పీటీసీ లు పాల్గొన్నారు.