కేసీఆర్ కృషి ఫలితం.. సీతారామ ప్రాజెక్టు

16
- Advertisement -

కేసీఆర్ కృషి ఫలితమే సీతారామ ప్రాజెక్టు అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. నెర్రెలు బాసిన సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు తీసుకొచ్చారన్నారు. నాడు సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించిన కాంగ్రెస్..అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు వేసిందన్నారు. నేడు గోదావరి జలాల వద్ద ఫోటోలకు కాంగ్రెస్ నాయకులు ఫోజులివ్వడం విడ్డూరంగా ఉందన్నారు.

తిట్టడం తప్ప.. కట్టడం రాని కాంగ్రెస్ కు, కెసిఆర్ గొప్పతనం ఇప్పటికైనా అర్థం కావాలి.. ఈ ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు నీరు రాదు అన్నోళ్ళు, ఏం సమాధానం చెబుతారు? అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చింది.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రోజుకు పదివేల క్యూసెక్కుల కృష్ణ జలాలను ఆంధ్ర తరలించుకుపోతున్న పరిస్థితి ఉందన్నారు.

ఈ తరుణంలో రైతులను ఆదుకునేందుకు ఏకైక మార్గం గోదావరి జలాలను ఒడిసి పట్టి, ఎత్తిపోయడం… దీన్ని ముందే అంచనా వేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు… కేంద్రం కొర్రీలను, కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఛేదించి వడివడిగా (90%)శాతం పనులు పూర్తి చేశారు అన్నారు.

ఇదే కాంగ్రెస్ నేతలు నాడు సీతారామ ప్రాజెక్టే వృధా అన్నరు. అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు వేయించారు… కానీ కెసిఆర్ పట్టుబట్టి న్యాయపరమైన చిక్కులు తొలగించి, అత్యంత క్లిష్టమైన అటవీ_పర్యావరణ అనుమతులు సాధించి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయించారు. ఆ ఫలితమే నేడు కరువు కోరల్లో చిక్కుకున్న ఖమ్మం జిల్లా రైతులకు వరంగా మారిందన్నారు.

Also Read:మంచు మనోజ్.. ఎమోషనల్ పోస్ట్

బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి సిద్ధంగా ఉంచిన సీతారామ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ అక్కడ ఫోటోలకు మంత్రులు, నాయకులు ఫోజులు ఇస్తున్నారంటే అందుకు కేసిఆర్ ఏ కారణం… ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల సాగు, తాగునీటి కష్టాలకు సీతారామ ఒక శాశ్వత పరిష్కార మార్గం అన్నారు.

ప్రత్యక్షంగా ఆరు లక్షల ఎనబై వేల ఎకరాలకు, పరోక్షంగా పది లక్షల ఎకరాలకు సీతారామ ద్వారా గోదావరి జలాలు.. సీతారామా ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని నాడు ప్రతిపక్షంలో ఉండి ఇదే కాంగ్రెస్ నాయకులు విమర్శించారు… 2023 డిసెంబర్-7న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది. అదికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మీద విషం చిమ్మారు అన్నారు.

వృథా ప్రాజెక్టు అన్నారు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. డిపిఆర్ లేదన్నారు… ఒకే ఒక్కసారి మంత్రులు బృందం పర్యటించి, 2024 ఆగస్టు-15వ తేదీన మూడు పంపు హౌసులను ఏకకాలం స్విచ్ ఆన్ చేసి ప్రాజెక్టును ప్రారంభించారు.కేసీఆర్ మొక్కనోని దీక్షముందు కాంగ్రెస్ నేతల ఆరోపణలు పటాపంచలు అయిపోయారు. బీఆరె్ఎస్ ప్రభుత్వ కష్టం, నేడు సగౌరవంగా రైతుల ముంగిట నిలబడింది. 60 ఏండ్ల కాంగ్రెస్, టిడిపి పాలనకు, పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనకు తేడాను సుస్ఫష్టం చేసింది. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే పదిలక్షల ఎకరాలకు నీళ్లించే ప్రాజెక్టును ప్రారంభించారంటే… దాని వెనుక బి ఆర్ ఎస్ ప్రభుత్వ కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.

ఓట్లు, సీట్లు, అధికారం శాశ్వతం కాదని, మనం చేసిన అబివృద్దే శాశ్వతమని నమ్మే నాయకుడు కేసీఆర్.. అలా నమ్మి నిర్మించినవే కాళేశ్వరం, సీతరామా ఎత్తిపోతల ప్రాజెక్టులు… ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు రైతాంగానికి జీవనాడులై బాసిళ్లుతాయి. కేసీఆర్ కృషి దశదిశలా చాటుతాయి అన్నారు.

- Advertisement -