Harishrao: కేసీఆర్ కలల ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు

8
- Advertisement -

కేసీఆర్ కలల ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్‌.. సీతారామ ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ మంత్రులు నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. మంత్రులు ఈ ప్రాజెక్టు కోసం క్రెడిట్ తీసుకునేందుకు పోటీ పడుతున్నారని…ఈ నెల 15 న సీఎం రేవంత్ క్రెడిట్ తీసుకునేందుకు ఇంకో ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.

కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు ను తనకూ ఇష్టమైన పనిగా మొదలు పెట్టారని..ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారు అన్నారు. ప్రభుత్వం మారడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చింది…రిబ్బన్ కటింగ్ చేసే ఆవకాశం వచ్చిందని ప్రాజెక్టు తామే కట్టామని కాంగ్రెస్ మంత్రులు కటింగ్ ఇచ్చుకుంటున్నారు అన్నారు.

ఈ ఏడు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తయిందంటున్న కాంగ్రెస్ నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారని…30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి హడావుడి చేసినట్టు సీతారామ ప్రాజెక్టు విషయం లో చేస్తున్నారు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ను అడ్డంకులు సృష్టించేందుకు కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లారు అని గుర్తు చేశారు హరీష్‌.ఈ విషయాన్ని అపుడు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావే స్వయంగా చెప్పారు ..సీతారామ ప్రాజెక్టును ఘనత కేసీఆర్ ది కాదని తుమ్మల గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా ? అని ప్రశ్నించారు. జూన్ లోనే ఖమ్మం జిల్లాలో నాట్లు పడేలా సీతారామ ప్రాజెక్టు ను రూపొందించాం..3 వేల చెరువులను నింపేలా సీతారామ ప్రాజెక్టు ను డిజైన్ చేశాము అన్నారు.

బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హాయం లో చేసిన పనులు ప్రారంభించడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం లో చేసిందేమి లేదు ..సర్పంచ్ లే కాదు ..పంచాయతీ సెక్రటరీ లను అప్పులు పాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఆరోపించారు.

Also Read:KTR : కోల్‌కతా డాక్టర్‌ ఘటనపై కేటీఆర్‌

- Advertisement -