సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపు లపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. 690 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి సీతక్క చెప్పారు…ఈరోజు రాష్ట్రంలో బడాబడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు, కానీ సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదు. అని మండిపడ్డారు.
ఏడాది కాలం నుండి 690 కోట్లు ఇవ్వకుండా సర్పంచులు, ఎంపీటీసీలను ఈ ప్రభుత్వం గోస గుచ్చుకుంటుందని…గవర్నర్ ను కలిసి మొర పెట్టుకున్నారు, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారు. ఎక్కడిక్కడ వారిని అరెస్టులు చేశారు అన్నారు. కెసిఆర్ పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దారు…పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేశారు అన్నారు.
పల్లె ప్రగతికి ప్రతి నెల 275 కోట్లు, పట్టణ ప్రగతి కోసం 150 కోట్లు ఇచ్చాము…కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వ చెబుతున్న లెక్కలు. దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామపంచాయతీలు ప్రకటిస్తే 20 కిగాను 19 తెలంగాణ గ్రామాలకు వచ్చాయన్నారు. తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కెసిఅర్, బి ఆర్ ఎస్ ది అని…ఈ ప్రభుత్వం వచ్చాక SFC నిధులు విడుదల కావడం లేదు, 15 ఫైనాన్స్ కమిషన్ బిల్లులు డైవర్ట్ చేశారు అన్నారు.
జిపి ఫండ్ కూడా ఖర్చు పెట్టుకోకుండా చేశారు…సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. అప్పులు చేసి, బంగారం కుదువపెట్టి గ్రామ పంచాయతీ పనులు చేశారు….నవంబర్ ఒక్క నెలలోనే బడా బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లు విడుదల చేశారు అన్నారు. చిన్న పనులు చేసిన సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసి లకు బిల్లులు విడుదల చేయకుండా పగ బట్టారు, కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు..గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయక పోవడం వల్ల రోగాలు పెరిగాయన్నారు.
Also Read:KTR:అప్పులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
తెలంగాణకు పోతే చికెన్ గున్యా ఉంది, వెళ్ళకండి జాగ్రత్త అని అమెరికా హెచ్చరించిన దుస్థితి…ఇది దేశానికి, తెలంగాణకు అవమానం అన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు 9 నెలలు అయినా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు, జీతాలు ఇవ్వరు…అప్పులు కట్టలేక వారు చాలా బాధల్లో ఉన్నారు అన్నారు. ఇప్పటికైనా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన తేదీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు హరీశ్ రావు.