Harish:రైతుబంధు ఎగనామం,బోనస్ బోగస్

3
- Advertisement -

రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించారు. సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటాం అన్నారు కానీ ప్రభుత్వం సకాలంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు పండించిన వడ్లన్నీ దళారుల పాలయ్యాయి అన్నారు.

రాఘవపూర్ గ్రామంలో 4-5 వేల క్వింటాళ్ల వడ్లు ఇప్పటికే స్థానిక రైస్ మిల్లులకు, మధ్య దళారులకు అమ్ముకున్న పరిస్థితి నెలకొందన్నారు. అబ్దుల దేవయ్య అనే రైతు 92 క్వింటాళ్ల వడ్లు కల్లంలో పోసి నెల రోజులు ఎదురు చూసి 1900 రూపాయాలు అమ్ముకున్నాడు. అంటే క్వింటాల్ కి 420 రూ నష్టం. కాంగ్రెస్ ఇస్తానన్నా బోనస్ తో కలిపితే 81,000 రూ ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల నష్టం జరిగిందన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్నో మాటలు చెప్పారు కనీసం ఒక్క మంత్రి అయినా వడ్ల కల్లాలకు పోయి ఏంటి పరిస్థితి అని చూస్తున్నారా..?, బోనస్ ఇవ్వకుండా, వడ్లను కొనకుండా రైతులను అన్ని విధాలుగా నష్టం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అన్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదు రాబందు ప్రభుత్వం. రైతుల ఉసురు పోసుకుంటున్నావు, కన్నీళ్లు పెట్టిస్తున్నావు అని మండిపడ్డారు. మొదట రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచు, తక్షణమే 48 గంటల్లో కొన్న వడ్లకు డబ్బులు చెలించి రైతులకు కొంత ఊరటనివ్వు అన్నారు. రేవంత్ వచ్చాక రైతు బందు ఎగబెట్టిండు, బోనస్ బోగస్ చేసిండు, వడ్లు కొనే దిక్కులేని పరిస్థితి చేసిండు. రెండు లక్షలు రుణమాఫీ అన్నాడు రాఘవపూర్ లో సగం మందికి మాఫినే కాలేదు అన్నారు.

Also Read:‘అమరన్’…బ్లాక్ బస్టర్

- Advertisement -