రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అనిమండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన హరీష్ రావు..ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్నారు అన్నారు. అధికారంలోకి వచ్చినా మొదటి రోజే రూ 2లక్షలు చేస్తామని చేతులెత్తెషిండ్రు.. సీఎం రేవంత్ మాటలు నమ్మి రైతులు రెండులక్షల రుణాలు తెచ్చుకున్నారు.. బ్యాంకుల్లో మిత్తి కట్టారు అన్నారు.
దేవుళ్లను మోసం చేసిన రేవంత్ కు రైతులను మోసం చేయడం లెక్కా..?, రైతులతో మిత్తిలు కట్టించి రుణాలు ఇవ్వలేదు అని ఆరోపించారు. మొదటి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ సర్కార్ మోసం చేసింది.. అన్ని వర్గాలను ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది అన్నారు. అసెంబ్లీ లో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటసింది.. రూ 2లక్షల రుణమాఫీ మీద రైతులు కాంగ్రెస్ నేతలను నిలదీయండి అని పిలుపునిచ్చారు హరీష్.
Also Read:రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏపీ!
రైతుబందు ఎగొట్టిండ్రు.. కరోనా కష్ట కాలంలో కూడా కెసిఆర్ రైతుబందు వేసిండు అన్నారు. 14వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు డబ్బులు వేసిండ్రు.. కాంగ్రెస్ మాటలే తప్ప చేతలు లేవు అన్నారు. ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం లేదు.. కల్వకుర్తి, ఆమన్ గల్ తన అత్తగారి ఊరికి రూ 5వేల కోట్లతో రోడ్లు వేస్తున్నారు అన్నారు. ఉద్యోగులకు రిటైర్ అయితే పెన్షన్ ఇవ్వడంలేదు.. బకాయిలు ఇవ్వడం లేదు.PRC ఊసే లేదు.. DA లు ఇవ్వడం లేదు అన్నారు. సర్పంచులకు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు.. బడా కాంట్రాక్టర్ల కు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి..? చెప్పాలన్నారు.
GHMC లో 20 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచారు ఆడబ్బు ఎక్కడినుండి వచ్చింది..?, రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలి.. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా రైతుల పక్షాన నిలదీస్తాం అన్నారు. రుణమాఫీ సంపూర్ణంగా జరిగే వరకు, రైతు భరోసా రైతులందరికీ వచ్చే వరకు ఈ ప్రభుత్వం వెంట పడతాం..రైతులు కూడా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలి.. ప్రశ్నించాలి అన్నారు.