రుణమాఫీపై చేతులెత్తేసిన సర్కార్!

2
- Advertisement -

అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీ పై చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనతో రుణమాఫీ కథ ముగించే కుట్ర చేస్తున్నారని స్పష్టమవుతుందన్నారు. సీఎం మాటలు విని రెండు లక్షల పైన రుణం ఉన్న రైతులు అప్పు చేసి, మిత్తి తో సహా బ్యాంకులకు కట్టారు అన్నారు.

తమకు రుణమాఫీ ఎప్పుడు అవుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు… ఈరోజు వ్యవసాయ మంత్రి ప్రకటనతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది అన్నారు. రెండు లక్షల లోపు రుణ మాఫీ కాని వారి పరిస్థితి, రెండు లక్షల పైన రుణం ఉండి మాఫీ కాని రైతుల పరిస్థితి ఏమిటి? చెప్పాలన్నారు.

నమ్మి ఓటేసిన పాపానికి నయవంచన చేసింది కాంగ్రెస్ సర్కారు… ఇలాంటి అసంబద్ధ ప్రకటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణ ప్రజలకు, రైతులకు క్షమాపణలు చెప్పాలని బి ఆర్ ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నాం.. రైతులను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి ని ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటుంది. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటుందన్నారు.

- Advertisement -