పీసీ ఘోష్ కమిషన్ ని కలిసి అదనపు సమాచారం అందించాం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పీసీ ఘోష్ కమిషన్ కు అదనపు సమాచారం అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు హరీశ్. కమిషన్ నిన్న సమయం ఇచ్చారు. నిన్న కేసీఆర్ కి వైద్య పరీక్షలు ఉన్న నేపథ్యంలో రాలేకపోతున్నాను అని కమిషన్ ను రిక్వెస్ట్ చేయగా అంగీకరించారు…వారిచ్చిన సమయం ప్రకారం, ఈరోజు కమిషన్ ను కలిసి మా వద్ద ఉన్న అదనపు సమాచారం అందించాం.మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను దృష్టిలో పెట్టుకొని మా వద్ద ఉన్నంత మేరకు కమిషన్ కు స్పష్టమైన సమాచారం ఇచ్చాం. మేం ఇప్పుడు ప్రభుత్వంలో లేము. డాక్యుమెంట్స్ అన్ని ప్రభుత్వం వద్ద ఉంటాయి. సమాచారం కోసం చీఫ్ సెక్రెటరీ, జీఏడీ సెక్రెటరీ, ఇరిగేషన్ సెక్రెట్రరీ గారికి లేఖ రాశానని తెలిపారు.
ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ నోట్ వంటి సమాచారం కావాలని లేఖల రూపంలో అడిగాను…కాని వారి నుంచి స్పందన రావడం లేదు
మా వద్ద అందుబాటులో ఉన్న సమాచారం క్రోడీకరించి నోట్ రూపంలో ఇవ్వడం జరిగింది.మా సమాచారం అధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయి. ఆరు సార్లు క్యాబినెట్ ఆమోదం పొందిన డాక్యుమెంట్లు కమీషన్ కు అందించాం.అంతే కాదు మూడు సార్లు శాసన సభ ఆమోదం కూడా పొందింది.ఎప్పుడెప్పుడు జరిగాయి, జరిగిన చర్చ, ఇతర అంశాలను కమిషన్ కు అందించాం.లెజిస్టేచర్ అప్రూవల్ క్యాబినెట్ కంటే కూడా ఉత్తమం అయినటువంటిది.ఆరు సార్లు క్యాబినెట్ అప్రూవల్ వివరాలను, మూడు సార్లు అసెంబ్లీ ఆమోదం, చర్చ వివరాలను కమిషన్ కు డాక్యుమెంట్లతో సహా అందించాం. కమిషన్ ఆన్ గోయింగ్ కనుక ఆ వివరాలు బయట పెట్టలేను.సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా ఆ వివరాలు బయట పెడతాం.ఇంతకు మించిన వివరాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం మాకు అడిగినా ఇవ్వడం లేదు.కమిషన్ కు అందించిన సమాచారం మాకు ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం ఇవ్వడం లేదు.పారదర్శకంగా ఉండాలనుకుంటే మాకు ఆ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు.కమిషన్ ను తప్పుదోవ పట్టించేలా వివరాలను ఈ ప్రభుత్వం అందిస్తుందనే అనుమానం మాకు ఉంది అన్నారు.
మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, 50 ఏండ్ల కాంగ్రెస్ ద్రోహ చరిత్రకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్..వందలాది మంది ద్రోహులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్,తెలంగాణను ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్..నీళ్లు వదిలిపెట్టి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ,అజ్ఞానం, అహంకారంతో రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు..299:512 శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే అబద్దం చెప్పడం సిగ్గుచేటు..తాత్కాలిక నీటి వినియోగం, నీటి పంపకానికి తేడా తల్వకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు..నీటి వినియోగం కేఆర్ఎంబీ చేస్తుంది, నీటి పంపకం ట్రిబ్యునల్ చేస్తుంది.
నీటి వినియోగం ఆ ఏడాదికి మాత్రమే పరిమితం, నీటి పంపకం శాశ్వతమైంది…శాశ్వతంతా పంపిణీకి సంతకాలు పెట్టామని చెప్పడం పచ్చి అబద్దం.
ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ పాలకులు ఇదే జానారెడ్డి, ఉత్తం, కోమటి రెడ్డి వంటి చేతగాని నాయకుల వల్ల, పెదవులు మూసుకోవడం వల్ల 299 మనకు కేటాయించడం జరిగింది అన్నారు.
ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి శాసన సభలో ప్రవేశపెట్టారు, అది శాసన సభ రికార్డుల్లో కూడా ఉంది.ఆనాటి కాంగ్రెస్ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి ఇచ్చిన నివేదికలోనూ గోదావరిలో 968, కృష్ణాలో 299 టిఎంసీలు కేటాయించిన విషయం చెప్పారు.గోదావరిలో 968 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ అని గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డి, కృష్ణాలో 299 ఇచ్చి అన్యాయం చేసిన విషయం ఎందుకు దాచి పెడుతున్నావు.పదో తరగలి పిల్లవాడిని అడిగినా చెబుతారు.. శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే, సెక్షన్ 3 కోసం కేసీఆర్ గారు ఎందుకు అడుగుతారు.నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నదిలో పున: పంపిణీ చేయాలని ఎందుకు అడిగారు.
రాష్ట్రం ఏర్పడిన 42వ రోజునే ఢిల్లీలో సెక్షన్ 3 కింద నీళ్ళు పంపిణీ చేయండి, 299 ఇచ్చి అన్యాయం చేసారు, 68శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి వాటా ఇవ్వాలని కేసీఆర్ గారు అడిగారు.సెక్షన్ 3 కోసం కేసీఆర్ గారు ఉమా భారతి గారిని కలిసారు, గడ్కరి, షకావత్ , ప్రధానిని కలిసారు.సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3 సాధించింది కేసీఆర్…నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తది, ఆ ట్రిబ్యునల్ సాధించింది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారూ.. ఈరోజు మనకు 763 టీఎంసీల కోసం న్యాయవాదులు, ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తున్నది. దానిపై దృష్టి పెట్టండి.ఇదే రేవంత్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయ్యింది. 299 టీఎంసీలు చాలని 2025లో ఉత్తం, రేవంత్ సంతకాలు పెట్టుకొని వచ్చారు.299 టీఎంసీలకు మీరెందుకు సంతకాలు పెట్టారు? చెప్పాలన్నారు.
కొద్ది నెలల్లో కృష్ణాలో మంచి వాటా రాబోతున్నది.అహంకారం, వెటకారం వదిలి తెలంగాణకు ఉపకారం చేసే మంచి బుద్దితో నడుచుకో రేవంత్ రెడ్డి అజ్ఞానం అని రేవంత్ ను బాధతో అంటున్న గోదావరిలో 1000, కృష్ణలో 500 ఇచ్చి ఎన్ని నీళ్లన్నా తీసుకుపో అని చంద్రబాబుకు రేవంత్ ఆఫర్ ఇచ్చిండు.ఇది అజ్ఞానం కాదా. గోదావరిలో మన వాటా 1000 కాదు, 2918 కావాలని కేసీఆర్ అడిగారు.ఇదే విషయం బయట పెడితే నాలుక కరుచుకున్నరు.అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిండు.రేవంత్ రెడ్డి మాత్రమే ఉత్తం కూడా అజ్ఞానిలా మాట్లాడుతున్నారు.నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి మన నీటి హక్కుల గురించి తెలవక పోవడం బాధాకరం.కృష్ణాలో ఒకవైపు 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తుంటే, ఉత్తం మొన్న 573 టీఎంసీలు చాలు అని అన్నడు.రేవంత్, ఉత్తం మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు,,చంద్రబాబు చెప్పినట్లు పని చేస్తున్నరా, రాష్ట్రం కోసం పని చేస్తున్నరాగో,గోదావరి, కృష్ణలో 1000, 500 టీఎంసీలు చాలు అనడం అజ్ఞానంతో మాట్లాడిన మాటలు..బాగా చదువుకొని, ఇంజినీర్లతో మాట్లాడి తెలుసుకొండి..బేసిన్ల గురించి తెల్వని ఆయన సీఎం అయ్యిండు,బేసిక్స్ తెల్వని ఆయన నీటి పారుదల శాఖ మంత్రి అయ్యండు..నేనే వాదనలు వినిపించిన అనే ఉత్తంకు ఈ మాత్రం తెల్వదా చెప్పాలన్నారు.
రేవంత్ రెడ్డికి అతి తెలివి ఎక్కువు. అందుకే అతి తెలివి మాటలు మాట్లాడుతున్నడు.ఉమ్మడి ఏపీలో 54లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా అన్నడు.రేవంత్ రెడ్డి పుట్టక ముందు ముత్తాత పుట్టక ముందు ఉన్న ఆయకట్టును కూడా కాంగ్రెస్ లో కలుపుకున్నడు..400 ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా కాంగ్రెస్ చేసిందా నిజాంలు కట్టిన ప్రాజెక్టులు కూడా అందులో కలుపుకున్నడు..ఎన్నో ప్రాజెక్టులు గోదావరి, కృష్ణా 1956 ముందు తెలంగాణ ప్రాంతంలో ఉన్నయి.16లక్షల ఎకరాలు ఏపీ ఏర్పాటుకు ముందే నీటి పారుదల సౌకర్యం ఉంది.ఇది కూడా కలుపుకొని 54లక్షలకు ఇచ్చినా అంటడు.1956లో రాష్ట్ర బడ్జెట్ 19 కోట్లు, ఆనాటి వంద రూపాయలు ఈనాటి 10,434 రూపాయలకు సమానం.ఆనాటి రూపాయి నేడు 104 రూపాయలకు సమాధానం.బిఆర్ఎస్ హయాంలో 17లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, 31లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసాం. మొత్తం 48లక్షల ఎకరాలకు సాధించినం.ప్రజల్ని తప్పుదోవ పట్టే ప్రయత్నం అతి తెలివి ఉపయోగించి.పదేండ్లు కాంగ్రెస్ పాలించింది, ఇచ్చిన ఆయకట్టు కేవలం కొత్త, స్థీరీకరణ కలిపి ఆరు లక్షల ఎకరాలు..మేము ఇచ్చింది 48 లక్షలు, పదేండ్ల కాంగ్రెస్ ఇచ్చింది ఆరు లక్షల ఎకరాలు అన్నారు.
తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు మేడిగడ్డకు మార్చారు అని అవే పచ్చి అబద్దాలు మాట్లాడారు.నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్లుసీ చెప్పింది.నాలుగేండ్లలో పూర్తి చేస్తారు అన్నరు, 8 ఏండ్లలో సిడబ్లుసి నుంచి 160 టిఎంసీల నీటి లభ్యతకు క్లియరెన్స్ ఎందుకు తేలేదు. మహారాష్ట్రతో ఎందుకు అంతరాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు.
తమ్మడిహట్టి వద్ద 160 టీఎంసీల లభ్యత లేదు, అక్కడ ఉండేది 102 మాత్రమే, అందులో 44 మాత్రమే తీసుకోవచ్చని తేలింది.వైల్డ్ లైఫ్ ఉండటం వల్ల అనుమతులు రాలేదు. ఇవన్నీ తెలిసి మీలాగా కమిషన్లు తీసుకొని ప్రజల్ని మోసం చేయాలా? ,వ్యాప్కోస్ సూచిస్తే మేడిగడ్డ దగ్గర పెట్టినం నీటి లభ్యత తమ్మడిహట్టి వద్ద లేదని చెప్పింది. మేడిగడ్డ వద్ద 282 నీటి లభ్యత ఉందని తేలింది. జలాశయాల సామర్థ్యం, నీటి వినియోగం, ఆయకట్టు, పంపింగ్ సామర్థ్యం, భూసేకరణ పరిహారం పెరిగాయి కాబట్టి అంచనాలు పెరిగాయి. అన్ని ఆధారాలు ఉన్నాయి, దమ్ముంటే నీకు నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టు ఒక్కటే షరతు, మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోవద్దు ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైన చర్చిద్దాం అన్నారు.
283లక్షల టన్నుల పంట పండిందని గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డి, అది ఎట్ల సాధ్యమైంది..20 నెలల్లో ఒక్క చెరువు తవ్వలేడు, ఒక్క చెక్ డ్యాం కట్టలేదు, ఒక్క ప్రాజెక్టు లేదు. మీరు వచ్చిన తర్వాతే ఎస్ ఆర్ బీ సీ కి లైనింగ్ అయ్యింది,మీ చేతగాని తనం వల్ల లైనింగ్ జరిగి నీళ్లు తీసుకుపోతున్నారు..మేం రాయలసీమ లిఫ్టు, ఎస్ ఆర్ బీ సీ ఆపాము గత వేసవిలో లైనింగ్ జరగం వల్లనే నీళ్లు ఎక్కువ పోతున్నాయి..నాడు నేడు ఎప్పుడు కాంగ్రెస్ దే పాపం ..నాడు కృష్ణాలో తెలంగాణకు 299 టీఎంసీ కేటాయించి అన్యాయం చేసింది కాంగ్రెస్. నేడు కూడా అదే ద్రోహం. ఉన్న 34శాతం నీటి వాటాలో గతేడాది 28శాతమే వాడారు. ఆరున్నర లక్షల ఎకరాలు సాగయ్యే 65 టీఎంసీలను ఆంధ్రాకు, చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లించారు. ఎందుకు ఇంత తక్కువ వాడారు..నీళ్లు చంద్రబాబుకు, ఆంధ్రాకు ఎందుకు వదలారు
ఇది మీ వైఫల్యం కాదా? చెప్పాలన్నారు.

