భారత సైన్యాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది

9
- Advertisement -

భార‌త సైన్యాన్ని చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీష్‌.. భార‌త్ భూభాగంలో ఉగ్ర‌వాదానికి స్థానం లేదు.. భార‌త‌దేశం ఎల్ల‌ప్పుడూ ఉన్న‌తంగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.

మ‌న శాంతిపై ఉగ్ర‌వాదం చేసిన‌ప్పుడు.. మ‌న ఐక్య‌త బ‌లంతో, మ‌న సైనికుల ధైర్యంతో మ‌నం ప్ర‌తిస్పందిస్తామ‌ని అన్నారు. భార‌త సైన్యాన్ని చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంది. వారికి వెన్నుద‌న్నుగా నిల‌బడుతామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

 

Also Read:భారతీయుడిగా గర్వపడుతున్నా:కేసీఆర్

- Advertisement -