కాంగ్రెస్ ఏడాది పాలన, ఫార్ములా ఈ రేసు అంశాలపై “గ్లోబల్ ఎన్ ఆర్ ఐ అండ్ ఇండియన్ అమెరికన్స్ ఫోరం” నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రి హరీష్ రావు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాసీలు పాల్గొన్నారు. ఎన్నారైలు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఓపికగా సమాధానం ఇచ్చారు.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకే వేదికగా ఎన్నారైలను కలుసుకోవడం సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ అందరి కృషి ఉంది. తెలంగాణ అభివృద్ధిలోనూ మీ పాత్ర ఉంది. అందరం కలసి కృషి చేయడం వల్ల పదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించింది. దేశానికి ఆదర్శంగా నిలిచింది.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంత కృషి చేశామో, అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశాం అన్నారు.
కేసీఆర్ తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా నిలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందించారు. 24 గంటల పాటు క్వాలిటీ పవర్ అందించారు. ఇరిగేషన్ లో అద్భుత అభివృద్ధి సాధించింది. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను దాటి నెంబర్ 1 స్థానానికి చేరింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులు సాధించింది.
కేసీఆర్ పాలన పాజిటివిటీతో ప్రగతిని పరుగులెత్తించింది. బడ్జెట్ 62వేల కోట్ల నుంచి మూడు లక్షల కోట్లకు పెరిగింది.
జీఎస్డీపీ 5లక్షల కోట్ల నుంచి పద్నాలుగున్నర లక్షల కోట్లకు పెరిగింది.తలసరి ఆదాయం లక్షా 24వేల నుంచి 3లక్షల 47వేలకు పెరిగింది.27వేల కోట్ల సేల్స్ ట్యాక్స్, 73వేల కోట్లకు చేరింది.రిజిస్ట్రేషన్ల ఆదాయం రెండున్నర వేల కోట్ల నుంచి సుమారు 13వేల కోట్లకు చేరింది.సాగు విస్తీర్ణం కోటి 31 లక్షల ఎకరాల నుంచి రెండు కోట్ల 22 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.
ఐటీ ఎగుమతులు లక్షా పదివేల కోట్ల నుంచి 3లక్షల 33వేల కోట్లకు చేరింది. కేసీఆర్ మార్క్ పాలన దేశానికి దిక్సూచి అయ్యింది – రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది.సంక్షేమం విషయంలో అని వర్గాలకు మేలు చేసింది మా ప్రభుత్వం. కరోనా రెండు ఏళ్లు వచ్చినా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించింది. రైతు బంధు, పింఛన్లను ఎట్టి పరిస్థితుల్లో ఆపలేదు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి అటకెక్కింది. కేసీఆర్ గారి పాలనలో పురోగమనంలో ఉన్న తెలంగాణ 13 నెలల కాంగ్రెస్ పాలనలో తిరోగమనం పట్టింది.
ఆరు గ్యారెంటీలు, అందులో 13 హామీలు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మాట తప్పారు. ఈ గ్యారెంటీల అమలు గురించి మేము అడిగితే రాష్ట్రం దివాలా అనే డ్రామాకు తెరలేపారు. తెలంగాణ అప్పు 4.17 లక్షల కోట్లు అని, ఏడు లక్షల కోట్లు అనే తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా తిప్పి కొట్టాను. సగటున ఏడాదికి 40 వేల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ ఒక్క ఏడాదిలోనే లక్షా 37 వేల కోట్ల అప్పు చేసిందన్నారు.
కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మల్లన్న సాగర్ నుండి హైద్రాబాద్ కు 20 టీ ఏం సిలు సరఫరా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటనలు చేస్తడు. రెండు పియ్యర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయిందని ప్రచారం చేసారు.
ఇరిగేషన్ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. 2014 వరకు ఎంత పండిందో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంత పండిందో దాచేస్తే దాగని సత్యం.2014-15 లో 68లక్షల టన్నుల వరి పండితే, 2023-24 నాటికి కోటి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి.
2014-15లో కోటి 31లక్షల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం, 2023-24 నాటికి రెండు కోట్ల 22లక్షల ఎకరాలకు పెరిగింది. రికార్డు స్థాయిలో పంట పండిందని రేవంత్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నడు ఇదంతా ఎట్ల సాధ్యమైంది? అన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతి రోజు ప్రజా దర్బార్ అని మేనిఫెస్టోలో పెట్టిండు. ఒక్క రోజు బాగోతంతోనే ఓడగొట్టిండు. ముఖ్యమంత్రి కాదు కదా మంత్రులు కూడా రావడం లేదు. ప్రజాదర్బార్ ను ఉత్త ప్రహసనంగా మార్చివేసిండు.2 లక్షల రుణమాఫీ మీద మొదటి సంతకం అన్నడు. సగం మందికే చేశాడు. ఈరోజు కూడా ఇంకా లక్ష లోపు ఉన్నవాళ్లు, 2 లక్షల ఉన్న వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికీ రైతు బంధు లేదు, బీమా లేదు, బోనస బోగస్ చేశారు. మహిళలకు 2500 అన్నారు. ఇప్పటి వరకు పత్తా లేదు. పింఛన్లు పెంచుతామని మోసం చేశారు. విద్యార్థులకు ఉద్యోగాలు 2 లక్షలు, నిరుద్యోగ భృతి 4k ఇస్తామని మోసం చేశారు. 5 లక్షల ఇళ్లు అని, ఏడాది గడిచింది ఒక్క ఇల్లు కట్టలేదు. హైడ్రా తో కూల్చారు కానీ కట్టలేదు. గురుకులాల ఖ్యాతిని దిగజార్చారు. 57 మంది విద్యార్థులు చనిపోయారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.రేవంత్ రెడ్డి హామీ ఇస్తే నమ్మరు అని, రాహుల్, సోనియా వచ్చి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు లేఖలు రాశారు.
పరిపాలన గాలికి వదిలి, ప్రతీకార చర్యలకు ప్రభుత్వం దిగింది.పగ ప్రతీకారం తప్ప పాజిటివ్ యాటిట్యూడ్ లేదు ఈ ప్రభుత్వానికి.
లగచర్లలో ఫార్మా చిచ్చు బెట్టి గిరిజన రైతులను నడి రోడ్డు మీద పడ్డారు. అప్పటికే ఉన్న ఫార్మా సిటీ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.శాంతి భద్రతల నిర్వహణలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. పది మాత ఘర్షణలు జరిగాయి. పోలీసు రిపోర్టులో 23% క్రైమ్ రేటు పెరిగింది. ఎమ్మెల్యేలు మీద దాడి, పార్టీ కార్యకర్తల మీద దాడి, రాజకీయ లక్షలు పెరిగాయి. ఈరోజు కూడా యాదాద్రి పార్టీ ఆఫీసు మీద దాడి జరిగింది.ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నాడనే కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారు.ఈ ఫార్ములా రేసు వచ్చేలా, తద్వారా హైద్రాబాద్ బ్రాండ్ పెంచడంలో కేటీఆర్ గారు కృషి చేశారు. నాలుగేళ్ల కోసం తెస్తే, కాంగ్రెస్ వెళ్ళిపోయేలా చేసిందన్నారు.
130 దేశాల్లో 50 కోట్ల మంది లైవ్ లో చూశారు ఈ కారు రేసింగ్ చేశారు..రాష్ట్రానికి ఇమేజ్ పెరిగింది. ఇన్వెస్ట్ మెంట్ పెరిగింది. రాష్ట్ర ఆదాయం పెరిగింది.అనేక రాష్ట్రాలు తెలంగాణతో పోటీ పడుతూ వచ్చింది..మంత్రి హోదాలో ఈవెంట్ నిర్వహణ కోసం 50% మనం చెల్లించాం…సంస్థ వారు సిఎం రేవంత్ ను కలిసి మిగతా 50 శాతం చెల్లించాలి అంటే చెయ్యలేదు. అందుకే కెన్సల్ చేశారు. ఈవెంట్ హైద్రాబాద్ నుండి పోయిందన్నారు.
Also Read:కౌశిక్ రెడ్డిపై కేసు