రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వండి:హరీష్

13
- Advertisement -

సిద్దిపేట జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్నారు మాజీమంత్రి హరీష్ రావు. నంగునూర్‌ మండలం రాజ్‌గోపాల్‌పేట గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. వడగండ్ల వానతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని డిమాండ్‌ చేశారు.

ఈ ప్రభుత్వం కోతలు పెట్టాలని మొత్తం సర్వే నంబర్లలో అద్దెకరం, పావు ఎకరం ఎక్కువ ఉందనే సాకుతో రైతులకు రైతుబంధు ఆపారు. రూ.9 వేల కోట్ల రైతుబంధు ఇవ్వాల్సి ఉంటే రూ.4 వేల కోట్లు మాత్రమే ఇచ్చాం అంటున్నారు. ఇంకా రూ.5 వేల కోట్లు పంటపెట్టుబడి సాయానికి కోతపెట్టారు అని మండిపడ్డారు.

Also Read:విజయశాంతి దంపతులకు బెదరింపులు

కరోనా కష్టకాలంలో కూడా రైతులకు కేసీఆర్‌ రైతుబంధు ఆపలేదు. పంట బీమాకు సంబంధించి బడ్జెట్‌లో డబ్బులు పెట్టి ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. వంట నష్టపరిహారం ఎకరానికి రూ.6 వేలు ఉంటే కేసీఆర్ రూ.10వేలకు పెంచారు అని తెలిపారు. నంగునూరు మండలంలో 11 గ్రామాల్లో దాదాపు 5,300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించాం అన్నారు. తక్షణమే వడగండ్ల వానకు పంట నష్టపోయిన కౌలు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

- Advertisement -