కంచె గచ్చిబౌలి భూముల్లో రేవంత్ సర్కారు జరుపుతున్న పర్యావరణ విధ్వంసం, ఉల్లంఘనలు, హెచ్ సీ యూ విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు లేవనెత్తుతున్న అంశాలు, వాస్తవాలతో కూడిన నివేదికను హోటల్ తాజ్ కృష్ణలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి అందించింది మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రతినిధి బృందం.
అనంతరం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రతినిధులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలు ఉల్లగించింది అన్నారు. పండుగ రోజులుల, సెలవు దినాల్లో పర్యావరణ విధ్వంసం చేసింది. అన్ని వివరాలతో సెంట్రల్ కమిటికి నివేదించాం…అడవుల విధ్వంసం, వన్య ప్రాణుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది అన్నారు.
11 పేజీలతో రిప్రెంజంటేషన్ ఇచ్చాం. దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ ఇచ్చాం.. కమిటీ మమ్మల్ని ప్రశ్నలు వేసారు, అన్నిటికి సమాధానాలు చెప్పాం,పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టు, యాప చెట్టు కొట్టుకుంటే పోలీసులు, ఎమ్మార్వో వెళ్లి లక్షల పెనాలిటి వేస్తారు..వేల సంఖ్యలో చెట్లు నరుకుతుంటే ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు..రైతుకు ఒక న్యాయం, సీఎం కు ఒక న్యాయమా..రైతుకైనా, పేద వాడికైనా ముఖ్యమంత్రికి అయినా న్యాయం సమానంగా ఉండాలి అన్నారు. ఎవరికైనా ఇల్లు కట్టాలంటే వాల్టా చట్టం ప్రకారం, గ్రామీణంలో రూ.50, పట్టణంలో రూ.100 చలాన కట్టి దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత కమిటీ చెప్పిన ప్రకారం, రూ. 450 డిపాజిట్ చేయాలి. ఒకటి బదులు రెండు చెట్లు పెట్టాలని నిబంధన ఉంటుంది. అలా అనుమతి పొందిన తర్వాత చెట్టు కొట్టాలి అన్నారు.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఏం జరిగింది…ఒక్క దరఖాస్తు కూడా పెట్టలేదు అటవీశాఖకు నిజానికి అటవీ భూమిలో కాదు, సొంత భూమిలో చెట్టు కొట్టినా అనుమతి పొందిలి. కంచె చేను మేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజ్ చేస్తున్నది. వేలాది చెట్లను నరుకుతున్నది…చెట్లు కొట్టడానికి పోలీసు స్టేషన్లలో టిజిఐఐసి దరఖాస్తు చేసింది…పోలీసులు న్యాయబద్దమైన పనా కాదా అని ఆలోచన చేయాలి కదా..టీజీఐఐసీ దరఖాస్తే నేరపూరితమైంది. చెట్లు నరకడానికి ఫారెస్టు అనుమతి ఉందా, వాల్టా చట్టం అనుమతి ఉందా అని అడిగి పోలీసులు అనుమతి ఇవ్వాలి..పోలీసు రక్షణలో రాత్రింబవల్లు 50 బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసారు..మూడు జింకలు చనిపోయిన పరిస్థితి..ఆవాసాలు కోల్పోయి జంతువులు ఇండ్లకు వస్తున్నయి..బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జింకను చంపితే జైలులో పెట్టారు, మూడు జింకలు చంపితే రేవంత్ రెడ్డి పై ఏం చర్యలు తీసుకోవాలి, ఈ ప్రభుత్వంపై ఏం చర్యలు తీసుకోవాలి…7 సంవత్సరాలు శిక్ష వేయాలని చట్టం ఉంది.మూడు జింకలు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా…గ్రామాల్లో కాదు, హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరిగితే ఇక్కడే ఉన్న పీపీబీ. అటవీ శాఖ, రెవెన్యూ శాఖలు ఏం చేస్తున్నాయి. నిద్రపోతున్నారా? చెప్పాలన్నారు.
Also Read:స్కూళ్లకు సెలవులు..ఎప్పటినుండో తెలుసా!
పేదలు చెట్టు కొడితే కేసులు పెట్టిన వారు, వేలాది చెట్లు ఊచ కొత కోస్తే నిద్ర పోతున్నారా.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పీసీసీఎఫ్ గారికి రెండో ఏప్రిల్ నాడు లెటర్ రాసారు..అనుమతి లేకుండా చెట్లు కుడుతున్నారని ఫిర్యాదు చేసిన తర్వాత కూడా స్పందించరా యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేస్తే కనిపించడం లేదా అటవీ శాఖ నేరపూరిత నిర్లక్ష్యం వేల సంఖ్యలో చెట్లు కుప్ప కూలాయి, జింకలు మృత్యువాత పడ్డాయి. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో అనేక రకాల ఉల్లంఘనలు జరిగాయి. 2002 వాల్టా యాక్టు ప్రకారం, ఎవరైనా చెట్టు కొట్టాలంటే అనుమతి తీసుకోవాలి.2017 జీవో నెంబర్ 23 ప్రకారం, చెట్టు కొట్లాలంటే ఆన్ లైన్ దరఖాస్తు చేయాలి, అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి..సుప్రీంకోర్టు ఆర్డర్ 2025 మార్చి 4 ఫారెస్టు భూమి అని రాయాల్సిన అవసరం లేదు, ఫారెస్టు నేచర్ కలిగిన భూముల వివరాలు సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను కోరింది…ఆ కమిటీ ఒకవైపు పని చేస్తున్నది…వీళ్లు ఆ భూములను గుర్తించి తెగనమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అశోక్ కుమార్ శర్మ ఐఎఫ్ఎస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ఉల్లంఘన జరిగింది అన్నారు. HCU భూముల్లో చెట్ల నరికివేతతో ఏడు చట్టాలను సీఎం రేవంత్ దుర్వినియోగం చేశారు అన్నారు.

