దీనస్థితిలో గురుకులాలు: హరీష్‌ రావు

13
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒకటి కాదు రెండు కాదు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో జరిగాయి అన్నారు.

వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కాగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కల్తీ ఆహారం విద్యార్థులకు పెడితే అరెస్టులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా గురుకులాల తీరు ఉందన్నారు.

రేవంత్ రెడ్డి మీ మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదు అనేందుకు గురుకులాల దీన స్థితే నిదర్శనం.. ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Also Read:పీఎం కిసాన్ అప్‌డేట్..

- Advertisement -