గురుకులాల్లో మరణ మృదంగం ఆపలేరా?

18
- Advertisement -

గురుకులాల్లో మరణ మృదంగం ఆపలేరా? అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్‌ రావు. బడికి పంపిన పిల్లలు విగతజీవులుగా మారుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడదా? అని ప్రశ్నించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ గురుకులంలో ఎనిమిదవ తరగతి విద్యార్థి వివేక్ అనుమానాస్పద మృతికి కారణం ఏమిటి? చెప్పాలన్నారు.

గురుకులాల నిర్వహణ గాలికి వదిలేసి, మొత్తం వ్యవస్థనే కుప్ప కూల్చే విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం దుర్మార్గం…అభం శుభం తెలియని విద్యార్థి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోతే ఒక్క అధికారి వచ్చి చూసిన పాపాన పోలేదు.
జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే గురుకులం సందర్శించాలని, మృతి పట్ల విచారణ జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాలని, ఘటనకు బాధ్యత వహించి విద్యార్థి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

 

- Advertisement -