Harish:మహారాష్ట్రకు నోట్ల కట్టలు ఎత్తుతున్న రేవంత్?

3
- Advertisement -

గత సంవత్సరం నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే ఈ సంవత్సరం కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు రావడం వల్ల ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. సాగు పెరిగిన కారణంగా నల్గొండ జిల్లాలో ఏడున్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంచనా వేసిందన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మూడు లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి నల్గొండ జిల్లాలో లేదు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలయిందని…సకాలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేక, గన్నీ బస్తాలు అందించలేక రైతులను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. రైతులు రూ .1800లకు క్వింటాల్ చొప్పున దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నాను ఎన్నికల ముందు బాండ్ పేపర్ రాసి రైతులకు 500 బోనస్, 15000 రైతుబంధు ఇస్తానని చెప్పి మాట తప్పవా లేదా? అన్నారు.

రైతుల వడ్ల లోడ్ ఎత్తమంటే మహారాష్ట్రకు నోట్లో కట్టల లోడ్ ఎత్తుతున్నాడు ముఖ్యమంత్రి..నల్గొండ జిల్లాలో 9,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, 200 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటే అందులో 50 కోట్లు మాత్రమే చెల్లించారు. రైతులకు సకాలంలో డబ్బులు అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు అన్నారు.వడ్లకు మద్దతుధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేసిన పరిస్థితి ఉందన్నారు.

Also Read:KTR: ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలన?

కొన్న వడ్లకు కూడా విపరీతంగా తరుగు పెట్టి రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం…నిన్న జగిత్యాల జిల్లా పర్యటనలో అక్కడి రైతులని అదిగితే ఒక కిలో సన్నవడ్లు కూడా కొనలేదని చెప్పారు. ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో కూడా ఒక కిలో సన్న వడ్లను కొనలేదు.సన్న వడ్లను కొనే వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ విప్లమైందన్నారు. ముఖ్యమంత్రికి ఈ మధ్య మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైంది..వడ్లు కొనకపోతే అధికారులను మిల్లర్లను ఎందుకు కొనట్లేదని అడగడం లేదు కానీ. మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారు అన్నారు.

మందు అమ్మకాల టార్గెట్ పెట్టి జనాలకు మందు ఎక్కువ తాగించి ఆదాయం పెంచాలని ఒత్తిడి చేస్తూ మెమోలిస్తూ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు అన్నారు. 25 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేశారు..తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు అన్నారు. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మద్యాన్ని ఏరులై పారిస్తామని కంకణం కట్టుకున్నాడు అని ఆరోపించారు.

తెలంగాణలో ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చావు కానీ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసి మహిళల పుస్తెల్లు తెంపుతున్నావ్…మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమిస్తామని చెప్పి మోసం చేసావ్.వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మహిళలకు అందజేయడం లేదు అన్నారు.భర్తలకు మద్యం తాగించి ఇల్లు గుల్ల చేయాలని చూసి మహిళలను ఇబ్బంది పెడుతున్నావ్…ముఖ్యమంత్రి ప్రజల గురించి కాకుండా పైసల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు.. రేవంత్ రెడ్డి రాజ్యంలో రైతులు దుఃఖపడుతున్నాడు…కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 15000 రూపాయల రైతుబంధు రైతులకు ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

- Advertisement -