ఉద్యోగుల డీఏ సంగతేంటి?:హరీష్

7
- Advertisement -

కృష్ణా నదిలో న్యాయమైన వాటా కిందకి వదిలింది మీరు, గోదావరి బనకచర్ల కడుతుంటే చేతులు కట్టుకొని చూస్తున్నది మీరు, శ్రీశైలం రైట్ కెనాల్ లైనింగ్ జరుగుతుంటే ఆపకుండా చూస్తున్నది మీరు కాదా చెప్పాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ను ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. బిఆర్ఎస్ లైనింగ్ పనులు ఆపిస్తే ఇప్పుడు మీరు వచ్చాక మొదలు పెట్టారు…తక్షణం ఆ పనులను నిలిపి వేయించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే బిజేపీ పెదవి విప్పడం లేదు… గోదావరి బనకచర్ల మీద బిజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు
రాష్ట్ర ప్రయోజనాలు బిజేపికి పట్టవా? అన్నారు. బనకచర్ల ద్వారా తెలంగాణ గోదావరిలో వాటా కోల్పోయే పరిస్థితి?, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పూర్తి అయితే రోజుకు 90వేల క్యూసెక్కుల చొప్పున తరలిస్తారు…బిజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు కండ్లు తెరవండి, ఏపీ నీటి దోపిడిని అడ్డుకోవాల్సిన కేఆర్ఎంబీ చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతుందన్నారు. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ అక్రమ పనులు ఆపడం లేదు?, గోదావరి బనకచర్ల అక్రమ ప్రాజెక్టును ఆపడం లేదు?,
ఉత్తమ్ కుమార్ రెడ్డి చిల్లర మాటలు మానాలి, బనకచర్ల ప్రాజెక్టు ఆపే ప్రయత్నం చేయాలి అన్నారు.

అఖిలపక్షం డిల్లీ తీసుకుపోవాలి. లేదంటే సుప్రీం కోర్టు మెట్లు ఎక్కు.. కేసీఆర్ కొట్లాడి, కేంద్రం మీద ఒత్తిడి చేసి సెక్షన్ 3 సాధించారు, గంధమల్ల ప్రాజెక్టు అంటే కాళేశ్వరంలో అంతర్భాగం.కాళేశ్వరం కూలితే గంధమల్లకు నీళ్లు ఎలా వస్తాయి రేవంత్ రెడ్డి … గంధమల్లకు ఎట్ల కొబ్బరి కాయ కొడుతున్నవు, గంధమల్ల, మల్లన్నసాగర్, రంగనాయర్ సాగర్, మిడ్ మానేర్, ఎల్లంపల్లి.. ఇదంతా కాళేశ్వరం కాదా రేవంత్ రెడ్డి…కుప్పకూలింది అని ప్రచారం చేసావు. కాళేశ్వరం కూలితే గంధమల్లకు గోదావరి జిలాలు ఎట్ల వస్తాయి చెప్పాలన్నారు.

భారత దేశంలో ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ..దాని కోసం 5 గంటలపైగా కేబినెట్ చర్చ ఎందుకు, సీపీఎస్ టు ఓపీఎస్ అని హామి ఇచ్చారు మాట తప్పారు అన్నారు. రెండో డీఏ వచ్చే ఏప్రిల్ లో ఇవ్వడం అంటే, మల్లో డీఏ యాడ్ అవుతుంది…ఉద్యోగస్థులను రాచి రంపాన పెడుతున్నారు, నిట్టనిలువునా ముంచుతున్నరు,కేసీఆర్ 73శాతం పీఆర్సీ ఇచ్చారు… ఇది దేశంలోనే అత్యధికం అన్నారు. మీరెందుకు ఇవ్వలేదు. మెరుగైన పీఆర్సీ అని మాట తప్పారు,మూడు కమిటీలు వేసి కాలయాపన చేశారు… తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

ఓల్డ్ పెన్షన్ స్కీ తీసుకురావాలి. బీఆర్ఎస్ ఇచ్చిన దాని కంటే ఎక్కువ పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం…ఉద్యోగస్థులను ఏసీబీ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో అప్పు లేని పంచాయతీ సెక్రెటరీ లేడు , అప్పులు తెచ్చి పంచాయతీ సెక్రటరీలు గ్రామ పంచాయతీలు నిర్వహిస్తున్నారు…కేసీఆర్ కాలంలో అవార్డులు వస్తే, కాంగ్రెస్ కాలం పంచాయతీలకు ఒక్క అవార్డు దిక్కులేదు అన్నారు.

Also Read:బ్యాచిలర్స్ ప్రేమకథలు..

- Advertisement -