కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే తాగునీటి కష్టాలు!

9
- Advertisement -

హైదరాబాద్‌లో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. వేసవి రాకముందే బోర్లు ఎండిపోతున్నాయి, భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. ప్రజలు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి వాటర్ ట్యాంకర్లను తెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు.

ఇంతకుముందెప్పుడూ హైదరాబాద్‌లో ఇలాంటి తాగునీటి సంక్షోభం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదికే పరిస్థితి విషమించింది. నివేదికల ప్రకారం, తెలంగాణలో భూగర్భజలాలు 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లు అడుగంటిపోయాయి. దేశంలోనే భూగర్భ జలాలు భారీగా క్షీణించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.

హైదరాబాద్‌లో 15% అదనపు వర్షపాతం నమోదైనా, భూగర్భజలాలు 1.33 మీటర్లు తగ్గాయి. కూకట్‌పల్లిలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడ భూగర్భ జలమట్టం ఏకంగా 25.90 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇప్పటికే అన్ని నిత్యావసరాల ధరలు కొండెక్కి విలవిలలాడుతున్న సామాన్యులు నీటి ట్యాంకర్ల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. గొంతు తడుపుకోడానికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమది ప్రజాపాలన అని ఊదరగొట్టుకోవడం సిగ్గుచేటు!

బీఆర్‌ఎస్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందింది. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించడంతో ఎండాకాలంలో మత్తడులు దుంకిన చెరువులు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, చెరువులు ఎండిపోతున్నాయి, భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి.ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రచారంలోనే మునిగిపోయింది. పాలనపై శ్రద్ధ పెట్టకుండా, రాజకీయ కక్షసాధింపు చర్యలతో బిజీగా ఉంది.హైదరాబాద్ నీటి గుక్కెడు మంచి నీళ్ళ కోసం అల్లాడుతోంది, కానీ కాంగ్రెస్ మాత్రం బాధ్యత వహించకుండా తప్పించుకుంటోంది. ఇది వారి పాలనా వైఫల్యానికి నిదర్శనం అని మండిపడ్డారు.

Also Read:గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌

- Advertisement -