- Advertisement -
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో ఇందిరమ్మకే తెలియాలంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు.వానాకాలం రైతు భరోసా ఎగరవేశారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామని చెప్పారని, దానిని జనవరి 26కు అంటూ మాట మార్చారని తెలిపారు. ఇప్పుడు మార్చి 31 వరకు అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే, దాన్ని ఎగ్గొట్టి రేవంత్ రెడ్డి రైతులకు భరోసా లేకుండా చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసరా రూ.4 వేలు, తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.
Also Read:కేసీఆర్‌ను మెచ్చకుంటున్నారు: కోమటిరెడ్డి
- Advertisement -