Harishrao:రేవంత్ నోట.. బూతులు తప్ప నీతులు రాలేదు!

4
- Advertisement -

వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి ఉందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదు..కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు అన్నారు.నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. నీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాం అన్నారు.

ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు అన్నారు. రేవంత్ రెడ్డి..! నువ్వు కేసీఆర్.. కేసీఆర్.. అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు అన్నారు.

తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినవు. షార్ట్ కట్ లో అధికారం చేజిక్కించుకొని ప్రజలను తొక్కుతున్నవు అని మండిపడ్డారు.

Also Read:ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం!

- Advertisement -