భట్టి బడ్జెట్ – బడా జూట్ బడ్జెట్: హరీష్

11
- Advertisement -

భట్టి బడ్జెట్ ప్రసంగం చూస్తే రాజకీయ ప్రసంగం లాగా ఉంది… పచ్చి అబద్దాలు, అసత్యాలు అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. బట్టి బడ్జెట్ – బడా జూట్ బడ్జెట్ ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయింది.. ఈరోజు బడ్జెట్ లో అబద్ధాలు, అతిశయోక్తులు తప్ప ఏమి లేవు అన్నారు. ఎన్నికల ముందు అన్ని చేస్తాం ,అధికారంలోకి రాగానే ఏమి చెయ్యమనే మాదిరి ఈ బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు. ఎన్నికల ముందు ఏం అడిగితే అది ఇస్తామని హామీ ఇచ్చారు… రేవంత్ రెడ్డి బయట, అసెంబ్లీలో అబద్ధాలే మాట్లాడుతున్నాడు అన్నారు.

లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నం అన్నరు. 20వేల కోట్లు ఇచ్చినం అంటున్నారు.. గతేడాది వచ్చే ఏడాది లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తం అన్నరు, మొత్తం వర్తిస్తదా అంటే లేదు 5లక్ష వరకే వర్తిస్తది అని జీవో 27 ప్రకారం అని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు అన్నారు. 5లక్షల వరకే వడ్డీ లేని రుణం, మిగతా 15లక్షలకు మహిళలే వడ్డీలు కడుతున్నరు.. తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెబుతున్నది నిజం, అసెంబ్లీ సాక్షిగా మహిళలందర్ని ప్రభుత్వం నేడు మోసం చేసిందన్నారు.

స్కూల్ విద్యార్థుల డ్రెస్ కుట్టు చార్జీలు 75ఇస్తున్నం అంటున్నారు. గత బడ్జెట్ లోనూ ఇదే చెప్పారు, మక్కీకి మక్కీ కాపీ కొట్టారు.. ఈ ప్రభుత్వం నిజంగా ఇస్తున్నది 50 రూపాయలు మాత్రమేనన్నారు. 75 ఇచ్చినట్లు రెండు బడ్జెట్లలో చెప్పుకున్నారు,బడ్జెట్ ప్రసంగం అబద్దం 3.. రేషన్ కార్డులు: ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని బడ్జెట్ లో చెప్పారు.. చాలెంజ్ చేస్తున్నా, బీఆర్ఎస్ 6లక్షల 47వేల రేషన్ కార్డులు ఇచ్చినం అన్నారు.

72పేజీల భట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే బడ్జెట్ లో రెండు పేజీలు పెరిగింది తప్ప, పేదల సంక్షేమం పెరగలేదు.. ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక కూడా అబద్దాలు సోనియా గాంధితో ప్రజలకు ఉత్తరం రాయించారు, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని ఈ బడ్జెట్ లో అయినా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా చూసారు , మహాలక్ష్మి ఊసే లేదు.. 2500 లేదు గానీ, 2500 కోట్ల అందాల పోటీల కోసం బడ్జెట్ లో పెట్టారు అన్నారు. 2023-24 లో వచ్చింది 5,966 కోట్లు..ఎట్లా వస్తది కేంద్రం నుంచి 1.34శాతమే కేంద్ర ఇచ్చింది. 2.9శాతం అని పెట్టారు..అన్ రియలస్టిక్ బడ్జెట్ ఇది అన్నారు.

కేంద్రం నరేగా కోసం గతేడాది 86వేల కోట్లు పెట్టింది, ఇప్పుడు కూడా అంతే పెట్టింది.. కానీ మీరు గతేడాది 2600 కోట్లు, ఇప్పుడు 3000 కోట్లు వస్తాదని బడ్జెట్ లో పెట్టారు.ఎట్లా వస్తది 400 కోట్లు ఎక్కువ మిడ్ డే మీల్స్ కోసం గతేడాది 145 కోట్లు వస్తే, ఈసారి 1200 కోట్లు వస్తాదని పెట్టారు.. మహిళలకు సంబంధించి 9కోట్ల 90 లక్షలు వస్తే, ఈ సారి 1949 కోట్లు వస్తాదని పెట్టారు, కేంద్రం మొత్తం పెట్టిందే 26000 కోట్లు, అందులో 1949 కోట్లు వస్తయా? పేదల ఇండ్లు కట్టుకోవడానికి 5లక్షలు, ఎస్సీ ఎస్టీకి 6లక్షలు, మొత్తం 4,50,000 ఇండ్లు కడుతం అని గత బడ్జెట్ లో పెట్టారు. బడ్జెట్లో 22,500 కోట్లు పెట్టారు.. 22 పైసలు ఖర్చు చేయలేదు, ఒక్క ఇళ్లు ఈ రాష్ట్రంలో కట్టలేదు.ఈ సారి ఏం చెప్పారంటే, మల్ల అదే ముచ్చట. అదే మక్కీకి మక్కీ…బడ్జెట్ అంకెల గారడీ, అబద్దాల గారడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కేవలం 600 కోట్లు పెట్టారు.రాష్ట్రంలో కోటి మంది కూలీలు ఉంటరు. కోటి మంది కూలీలకు 12వేలు ఎంత కావాలె?, నిజానికి 50వేల మందికి కూడా ఇవ్వలేదు.. భట్టి బడ్జెట్ బడా జూట్ బడ్జెట్ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కోల్పోయిందన్నారు.

Also Read:సూర్యాపేటకు కేటీఆర్..

- Advertisement -