రాహుల్ గాంధీ మళ్లీ హైదరాబాద్ వస్తే.. మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్‌లో అడ్డం పెట్టి మా ఆటో కార్మికులు నిన్ను నిలదీస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆనాడు ఓట్ల కోసం ఆటో ఎక్కావు.. ఓట్లు పడి గద్దె ఎక్కగానే రెండు ఏండ్ల నుండి వీళ్లని మర్చిపోయావా రాహుల్ గాంధీ? చెప్పాలన్నారు.
రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలియాలని.. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు ఎక్కి ఈ నిరసన కార్యక్రమం చేపడుతుంది అన్నారు. వెంటనే ఆటో కార్మికులకు బాకీ పడ్డ రూ.24 వేలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు హరీష్ రావు.
ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఆటోలో ప్రయాణించారు హరీష్ రావు. తన నివాసం నుండి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడినుండి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.. వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి..మద్యం టెండర్ల ద్వారా ఈ ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లు వచ్చాయి కదా.. అందులో సగం రూ.1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆదుకోండి అన్నారు.
ఆత్మహత్య చేసుకున్న 161 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలి… ఆటో సోదరులు ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకోవద్దు.. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఆటో కార్మికులను కాపాడుకుంటాం అని తెలిపారు.
Also Read:ఆటో డ్రైవర్ల సమస్యలు పట్టవా?:హరీష్

