జూబ్లీహిల్స్ ఎన్నిక నాలుగు లక్షల మంది ప్రజల భవిష్యత్తు కాదు, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.మీట్ ద ప్రెస్ లో మాట్లాడిన హరీష్… ఈ అరాచక ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలి. ఈ తీర్పు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు.,..రాష్ట్రంలో నలుగురు రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు..రెండేళ్ల రేవంత్ పాలన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు చరమగీతం పాడనున్నారు…కేసిఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో విధ్వంసం ,ప్రజలు విధ్వంసం కావాలా, వికాసం కావాలా ఆలోచించాలి.
రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్!..సమాచార హక్కు చట్టం ఉపయోగించి రియల్ ఎస్టేట్, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేశాడు అన్నారు.
ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అంటే, కాలేజీల మీద విజిలెన్స్ దాడులు, పోలీసుల దాడులు… బీ ఆర్ ఎస్ ప్రభుత్వం 19,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించింది.. రెండేళ్లలో రేవంత్ రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు… ఫీజు రియంబర్స్మెంట్ కాక కాలేజీలు బందు పెట్టారు..ఆ పిల్లలు జూబ్లీహిల్స్ లో కూడా ఉన్నారు…ఆరోగ్య శ్రీ వై ఎస్ తెచ్చిన పథకం అని గొప్పలు చెప్పడం కాదు, పథకం అమలు చేయడం లేదు, ఆసుపత్రులను బెదిరిస్తున్నారు…1900 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు ఇవ్వలేదు.బకాయిలు అడిగితే అధికారులు, విజిలెన్స్ దాడులు, పోలీసు దాడులు…రాష్ట్రంలో 11 పెద్ద ప్రాజెక్టులు, 13 వేల కోట్ల విలువైనవి చెరువుల్లో కడుతున్నారు, ఆపాలి అని భట్టి గారు అన్నారు. భట్టి ప్రెస్ మీట్, సీఎం సెటిల్మెంట్..ఉద్యోగ సంఘాలపై ఏసీబీ దాడులు. దేశంలో అత్యధిక డీఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం మన తెలంగాణ అన్నారు.
చివరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు…చేసింది చెప్పుకునేది లేక జూబ్లీహిల్స్ నాయకులు, ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. చివరకు ప్రజలను బెదిరిస్తున్నారు. పథకాలు ఆగిపోతాయి అని ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకున్నది.ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదు..ఓటమి భయంతో ఫ్రస్టేషన్ పోయిండు.బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి..కంటోన్మెంట్ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. .ఆరువేల డబుల్ ఇల్లు కడతాం అన్నారు
ఎక్కడ కట్టారు.స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నారు..డిఫెన్స్ లాండ్ రెగ్యలరైజ అన్నారు..నేను సవాల్ విసిరుతున్నా ఏం చేశారో చూపెట్టాలని రెండేళ్లలో ఎందుకు మైనార్టీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఎందుకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదు…ఎన్నికలు రాగానే ఎన్టీఆర్, పీజేఆర్ గుర్తు వస్తాడు…కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఏనాడైనా వెళ్లారా ఇప్పుడు మంత్రులు అందరూ లైన్ పడుతున్నారు అన్నారు.
రేవంత్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమనం, ఒక్క క్రైంలో మాత్రమే పురోగమనం…ఏ రంగం నమోదు చేయలేని వృద్ధి పోలీసు శాఖ నమోదు చేసింది.కేసీఆర్ గారు అగ్రికల్చర్ పెంచితే, రేవంతు గన్ కల్చర్ పెంచిండు మేం నోటికి అనడం లేదు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నమోదైన క్రైం రేటు చూస్తే రేవంత్ ఘనత ఏపాటిదో అర్థమైతది.మొత్తం 189 మర్డర్లు జరిగితే, అందులో 88 నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా జరిగిన హత్యలు.
1700 కిడ్నాప్లు
123 రేప్ కేసులు
1051 దొంగతనాలు
6411 ఇండ్లలో దొంగతనాలు
మహిళల పట్ల జరుగుతున్న నేరాల శాతం 12.3 % పెరిగాయి.
గడిచిన ఏడాదితో పోల్చితే అత్యాచారాలు 28శాతం,
కిడ్నాపులు 26శాతం
ఇప్పుడు సైబరాబాద్‌లో 41 శాతం, హైదరాబాద్‌లో 60 శాతం క్రైమ్ రేటు పెరిగింది.తెలంగాణలో 22శాతం క్రైం రేటు పెరిగినట్లు పోలీసు యాన్యువల్ రిపోర్టే స్పష్టం చేసింది.రేవంత్ రాక్షస పాలన చూసి పెట్టుబడులు తరలిపోతున్నాయి ..రియల్ ఎస్టేట్ ఢమాల్ అయింది ..కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు కడితే రేవంత్ పేదల ఇండ్లు కూల్చాడు అన్నారు.
ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే, కాంగ్రెస్ మెడలు వంచాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలి. సునితమ్మకు ఓటు వేయాలి. రాష్ట్ర ప్రగతికి దోహదం చేయాలి. అన్ని సర్వేలు బి ఆర్ ఎస్ గెలుస్తుంది అని స్పష్టం చేస్తున్నాయి ..సైలెంట్ వేవ్ రాబోతున్నది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతున్నది. బి ఆర్ ఎస్ గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.
Also Read:యంగ్ ఫిల్మ్ మేకర్స్ అవార్డ్స్–2025

