ఎంపీ అనిల్‌కు హరీశ్‌ లీగల్ నోటీసులు

7
- Advertisement -

ప్రజా సమస్యల పై పోరాడుతున్న నా పై బురద చల్లె వికృత రాజకీయాలకి తెరలేపినట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌కు లీగల్ నోటీసులు పంపారు.

ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకత ను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లు ఉన్నారు అని మండిపడ్డారు హరీశ్. గోల్కొండ కోట, చార్మినార్ లో కూడా హరీష్ రావు కు వాటాలు ఉన్నాయి అని అంటారేమో? అన్నారు. అబ్బద్దపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీస్ పంపుతున్నా అని బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

 

Also Read:ఆదివారం కూల్చివేతలా?:హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

- Advertisement -