Harish:అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే

27
- Advertisement -

జగిత్యాల జిల్లా కొడిమియల్ మండల్ పూడూరు గ్రామం లోని వడ్ల కొలుగోలు కేంద్రాన్ని సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలిచారు మాజీ మంత్రి హరీష్ రావు.రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చేస్తున్నామని, ప్రభుత్వం గానీ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు అని చెప్పారు. ధాన్యం తడిచి మొలకెత్తిందని వడ్లను కొనమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పండని సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం తమను మోసం చేయడమే అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాల్సిందే. లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం…అసెంబ్లీలో రైతుల పక్షాన మేము కొట్లాడుతాం .అసెంబ్లీ బయట రైతులందరూ ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు..రైతులకు ఇబ్బంది లేకుండా మూడు రోజుల్లోనే వడ్లను కొంటున్నామని, తడిసిన కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవానికి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయన్నారు.

100 రోజుల్లో వడ్లకు 500 బోనస్ ఇస్తామని అందరూ మోసం చేసిండ్రు. 100 రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వ్యవసాయ కూలీలకు 12,000, కౌలు రైతులకు 15000 ఇస్తామని మోసం చేసిండ్రు.రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతే లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం.. పోయిన యాసంగిలో 67 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే, కాంగ్రెస్ 30 మెట్రిక్ టన్నుల కూడా కొనలేదు. రైతులు బయట అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు.

Also Read:ధీరజ్ మొగిలినేని..”భజే వాయు వేగం”

- Advertisement -