ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన “చలో బస్ భవన్” పిలుపు నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. కోకాపేట లోని హరీష్ ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించీరు.
మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టి హౌస్ అరెస్ట్ చేశారు. శాంతియుతంగా జరగాల్సిన ప్రజా కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించిందని శంబీపూర్ రాజు తీవ్రంగా స్పందించారు.
పెంచిన చార్జీలపై ప్రజలకు జవాబు చెప్పలేని ప్రభుత్వమే ఈ విధమైన అణచివేత చర్యలకు దిగుతోందని వారు విమర్శించారు.బిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ఛలో బస్ భవన్ కార్యక్రమం ప్రజల వాణిని వినిపించేందుకు, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన ఉద్యమం అని శంబీపూర్ రాజు తెలిపారు.అయినా పోలీసులు చేసిన హౌస్ అరెస్ట్‌తో తాము వెనక్కి తగ్గబోమని, ప్రజా హక్కుల కోసం బిఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read:నేటి నుండి ఎంపీటీసీ,జడ్పీటీసీ నామినేషన్లు

