చిన్నారి సాత్వికకు బాసటగా హరీష్ రావు

20
- Advertisement -

తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారి సాత్వికకు బాసట నిలిచారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో విద్యార్థిని ఆవేదన అందరి మనసుల్ని కలిచివేసింది అన్నారు.

ఈ సందర్బంగా అధైర్య పడవద్దని అండగా ఉంటానని తల్లి, బిడ్డలకు భరోసా ఇచ్చాను. చెప్పిన విధంగానే సిద్దిపేట క్యాంప్ ఆఫీసులో ఆప్యాయంగా పలకరిస్తూ అల్పాహారం పెట్టానని తెలిపారు.

చిన్నారి ఆవేదన విని కరిగిపోయిన వ్యాపార వేత్త తిరుమల్ రెడ్డి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రాగా, 2 లక్షల చెక్కు అందజేసినట్లు తెలిపారు. చిన్నారి భవిష్యత్తులో చదువుకు అయినా, ఏ ఇబ్బంది అయినా అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

Also Read:తెలంగాణ పది ఫలితాల డేట్ ఫిక్స్

- Advertisement -