మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావుకి పితృవియోగం కలిగింది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణించారు. ప్రజల సందర్శనార్థం హైదరాబాద్‌లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్‌లో ఉంచబడుతుంది. అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిర్వహించబడతాయి.
తన బావ (కేసీఆర్ 7వ సోదరి, అక్క లక్ష్మీ గారి భర్త ), మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
సత్యనారాయణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావు కు ఫోన్ చేసి పరామర్శించిన కేసీఆర్, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Also Read:మీసాల పిల్ల…ట్రెండింగ్ @ 1

