ఆ రోజు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి : హరీశ్

2
- Advertisement -

తెలంగాణ భవన్‌లో మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు.. తెలంగాణ కోసం కేసీఆర్‌ దీక్ష చేసినప్పుడు ఆయన్ను చూస్తే నాకు ఏడుపొచ్చింది… అప్పటికీ కేసీఆర్ నిరాహార దీక్ష చేసి 11 రోజులైంది. కంట్రోల్‌లో లేడు, వణుకుతున్నాడు, కానీ పట్టుదల మాత్రం వీడలేదు అన్నారు. .

ఆ రోజు, ఆ సమయంలో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పటి సెంట్రల్ హోంమినిస్టర్ చిదంబరం కాల్ చేసి కేసీఆర్ మీరు దీక్షవిరమించాలని కోరినా.. ఆయన నమ్మలేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తేనే దీక్ష విడుతానని చెప్పాడని హరీశ్ రావు గుర్తు చేశారు.

తెలంగాణ జైత్రయాత్రనో.. కేసీఆర్‌ శవయాత్రనో అంటూ ఆమరణ దీక్షకు దిగారని గుర్తుచేశారు. కేసీఆర్‌ దీక్షకు దిగివచ్చిన కేంద్రం తెలంగాణ ప్రకటించిందని వెల్లడించారు. తెచ్చుకున్న తెలంగాణను అద్భుతంగా తయారు చేసిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. రేవంత్‌ రెడ్డి తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు.

Also Read:తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు

- Advertisement -