రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సురుకు తగలాలి.. కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తు ఓడిపోవాలి అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. లేదంటే హామీలు అమలు చేయకున్నా నన్ను గెలిపించారు అని ఇంకేం పనులు చేయడు, రూపాయి ఇవ్వడు అని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే మీ ఇండ్ల మీదకి బుల్డోజర్లు వస్తాయి… హైడ్రా ఖతం కావాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలి.. హైడ్రా బంద్ కావాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి అన్నారు. లేదంటే నేను ఇండ్లు కూలగొట్టినా నన్నే గెలిపించారు అని రేవంత్ రెడ్డి ఇంకా ఇండ్లు కులగొడుతాడు అన్నారు.
రామ రాజ్యం కావాలా.. రావణ రాజ్యం కావాలా ఆలోచించాలన్నారు విష్ణువర్దన్ రెడ్డి. తాను ఉన్నంత కాలం కాంగ్రెస్ జెండా ఎగరకుండా చేస్తాను అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇంట్లో ఉండే నల్లా బిల్లులు మాఫీ చేశాడు.. కానీ ఇప్పుడు మీ ఇంటికి వచ్చి బలవంతంగా బిల్లులు ఇస్తున్నారు అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నల్లా బిల్లులు కట్టకండి.. మేము మీ వెనక ఉన్నాము అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని యాదవ్.
Also Read:మైత్రి మూవీస్.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

