కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి:హరీష్

15
- Advertisement -

గజ్వేల్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్బంగా ఇందిరాపార్క్, ఎంపీడీవో చౌరస్తా వద్ద మాట్లాడిన హరీష్.. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో పాలు, నీళ్లు ఏమిటో అర్థం అయ్యి ఉంటుంది.ఎవర్ని అడిగినా రేవంతు పాలన ఎలా ఉందో చెబుతారు అని మండిపడ్డారు.

జానెడు సీసీ రోడ్డు పోయలేదు, మోరీ కట్టలేదు, రూపాయి పని గజ్వేల్ లో చేశారు.. గజ్వేల్ అభివృద్ది చేసిండు అని కేసీఆర్ ను ప్రతిపక్షాలు తిట్టినయి. మరి మనం కడుపులో పెట్టుకోవాలన్నా వద్దా? చెప్పాలన్నారు. ఒకప్పుడు గజ్వేల్ కు ఉత్తరం పోస్టు చేస్తే గద్వాల్ కు పోయేది. ఇప్పుడు గజ్వేల్ అంటే అభివృద్దిలో జిగేల్. గజ్వేల్ గౌరవం పెంచిండు కేసీఆర్ అన్నారు.

రోడ్డు పొక్కల్లో ఇంత డాంబర్ వేసే తెలివి లేని దద్దమ్మలు కాంగ్రెస్ పాలకులు..వీళ్లకు గజ్వెల్ లో ఓటు కావాలని తిరుగుతున్నరు.గజ్వెల్ లో కేసీఆర్ ను ఓడగొట్టాలని కట్టలు కట్టలు పంపిండట రేవంతు రెడ్డి…ఆ పైసలు మనల్ని కొట్టి కమాయించినవే. ఎవరు ఎన్నిఇచ్చినా అవే మా పైసలే అనుకొని తీసుకోవాలి..బిఆర్ఎస్ కు ఓటు గుద్ది కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలె అన్నారు.

Also Read:TTD:మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం

- Advertisement -