Harish:ఒక్క పనిచేయని దద్దమ్మ సర్కార్‌!

5
- Advertisement -

అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డికి ఉమ్మడి మెదక్ కు వచ్చేందుకు ముఖం లేదు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక్కడ హరీశ్ రావు ఉన్నడని భయపడుతున్నడు…నీ హామీలు, గ్యారెంటీలు గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇటు వైపు చూడటం లేదు రేవంత్ రెడ్డి అన్నారు. రెండున్నరేండ్లలో ఒక్క పని చేయని దద్దమ్మ సర్కారు ఇది అన్నారు.

స్కీంలు లేవు గానీ రేవంతు స్కాంలు ఉన్నయి.. మున్సిపాలిటీల్లో ఫాగింగ్ లేదు గానీ, అంతా ఫ్రాడింగ్.. ఇండ్ల పట్టాలైనా, మీకు నీళ్లైనా బరాబర్ వస్తయి..రేవంతు రెడ్డి ఏమైనా జేబుల నుంచి ఇస్తున్నడా చెప్పాలన్నారు. ఈ ఎన్నికలు మీకు చాలా ముఖ్యం. ఇవి రేవంతు రెడ్డికో, కేసీఆర్ గారికో ముఖ్యం కావు.ఎందుకంటే హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీల అమలు మరిచిపోయాడు.మహాలక్ష్మి అన్నడు, రైతు భరోసా అన్నడు, పంట బోనస్ అన్నడు, స్కూటీలు అన్నడు, తులం బంగారం అన్నడు ఇట్లా 420 హామీలు ఇచ్చిండు అన్నారు.

రెండున్నరేండ్లలో ఒక్క హామి అమలు కాలేదు.అయిన ఒక్క బస్సు పథకంలో భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్ కొడుతున్నడు.ఈ ఎన్నిక తప్పితే రేవంతు రెడ్డి మల్లా రెండేళ్ల వరకు దొరకడు.పొద్దున లేస్తే రేవంతు రెడ్డి కేసీఆర్ ను, నన్ను తిడుతడు..లేకుంటే కేటీఆర్ ఇంగ్లీష్ గురించి తిడుతడు.తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను పట్టుకొని తిడుతడు..కేసీఆర్ ను తిడుతే అవ్వాతాతల కడుపు నిండుతదా?,బొగ్గును పాలతో కడిగితే బొగ్గు నలుపు పాలకు అంటుతుంది కానీ బొగ్గు తెల్లగా కాదు అన్నారు.

అలాగే రేవంత్ రెడ్డి, హార్వార్డు పోయినా అంతరిక్షం పోయిన ఆయన మకిలి వాటికే అంటుంది తప్ప రేవంత్ నోటి మురికి పోదు…బూతులు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి పోలింగ్ బూతులో బుద్ధి చెప్పాలి.వాడిపోయిన కమలం పువ్వు గురించి నేను ఎక్కువ మాట్లాడ..రేవంతు రెడ్డికి సురుకు పెట్టాలె.అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంతుకు బుద్ధి చెప్పాలె.దుబ్బాకలో గులాబీ జెండా రెపరెపలాడాలి అన్నారు.

ALso Read:ఎన్నికల ప్రచారం..మాజీ మంత్రి హరీష్ రికార్డ్

- Advertisement -