దావత్‌లు మానండి..దాతలుగా మారండి

0
- Advertisement -

దావత్ లు మానండి, దాతలుగా మారండి అనే పిలుపుకు స్పందిస్తూ బీఆర్ఎస్వీ నాయకులు కంతుల రమేష్ విరాళంగా ఇచ్చిన దుప్పట్లను సిద్దిపేట పీజీ హాస్టల్ లో పంపిణి చేశారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. దావత్ లు బంద్ చెయ్యండి, దాతలుగా మారండి అనే పిలుపుకు చాలా మంది స్పందిస్తున్నారు అన్నారు హరీశ్‌ రావు.యువతకు జీవితాల్లో ఎదగటానికి ఇది చాల కీలకమైన సమయం. ఫోన్ లు వచ్చి యువతను చెడగొడుతుందన్నారు.

పుస్తకాలు తప్ప వేరే ప్రపంచం లేని రోజుల నుండి టివిలు వచ్చాయి, టివిలు పోయి కంప్యూటర్లు వచ్చాయి కంప్యూటర్లు పోయి ఫోన్లు వచ్చాయి. ప్రపంచం మొత్తం మీ చేతుల్లో కనిపిస్తుంది దాన్ని ఎలా ఉపయోగించుకునం అనేది మీ చేతుల్లో ఉందన్నారు. బాలకృష్ణ అనే కానిస్టేబుల్ తన భార్య, పిల్లలతో సహా ఆత్మ హత్య చేసుకున్నడు ఆ వార్త వినగానే చాల బాధ అనిపించింది. ఆ ఆత్మహత్యలకు కారణం ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలు అయ్యాడు. మీరు వాటి జోలికి పోకండి అన్నారు.

మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు వారిని తలెత్తుకునేలా చేస్తారా..తల దించుకునేలా చేస్తారో మీ చేతుల్లో ఉంది… మన్మోహన్ సింగ్ కిరోసిన్ దీపం కింద చదివి ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగాడు. పదవులకోసం అయన పోలేదు ఆయన చదువే ఆయనకు పదవులు తెచ్చి పెట్టిందన్నారు. చదువుకునే వయస్సులో ఆన్లైన్ గేమ్స్, పబ్జి లాంటి గేమ్స్ తో సమయం వృధా చెయ్యకండి.. పట్టుదల ఉంటె పేదరికం, సమస్యలు అడ్డుకావు. మీ లక్ష్యం కోసం మీరు ప్రయత్నించండి నా వంతుగా మీకు కావాల్సింది నేను చేస్తా అని హామీ ఇచ్చారు హరీశ్‌.

Also Read:సీఎం కప్‌ను బహిష్కరించిన కరాటే ఆటగాళ్లు

- Advertisement -