Harishrao:ప్రభుత్వ దమనకాండ సరికాదు

3
- Advertisement -

ప్రభుత్వ తీరు అమానుషం …లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన హరీశ్‌ రావు..లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణం అన్నారు.

ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం దారుణం అన్నారు. అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదు…ప్రభుత్వం తీరును ఖండిస్తున్నాం అన్నారు. ప్రజాభిప్రాయాన్ని తీలుసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశం తెలియాలన్నారు.

సీఎం వ్యక్తిగత ప్రయోజనాలకోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపివేయాలి. పోలిసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:మట్కా..పక్కా మాస్ ఫిల్మ్!

- Advertisement -